క్షమాపణలు చెప్పిన నటుడు మాధవన్‌

అగ్ర నటుడు మాధవన్‌ తన అభిమానికి క్షమాపణలు చెప్పారు. ఆయన, అనుష్క, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘నిశ్శబ్దం’. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబరు 2న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. మాధవన్‌ సైకోలా కనిపించి సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఆయన

Published : 10 Oct 2020 02:15 IST

ట్విటర్‌లో అభిమానులతో ఛాటింగ్‌

హైదరాబాద్‌: అగ్ర నటుడు మాధవన్‌ తన అభిమానికి క్షమాపణలు చెప్పారు. ఆయన, అనుష్క, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘నిశ్శబ్దం’. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబరు 2న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. మాధవన్‌ సైకోలా కనిపించి సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఆయన ట్విటర్‌ వేదికగా కాసేపు అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని ‘‘నిశ్శబ్దం’ ఫ్లాష్‌బ్యాక్‌ కన్విన్స్‌ చేసేలా లేదు. మీరేం అంటారు?’ అని కామెంట్‌ చేయగా మాధవన్‌ రిప్లై ఇచ్చారు. ‘ఇప్పుడు నేను కేవలం క్షమాపణలు మాత్రమే చెప్పగలను’ అని పేర్కొన్నారు. ఇలా ఆయనకు, అభిమానులకు మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణలు చూద్దాం..

కోలీవుడ్‌లో మీరు నటించిన చిత్రాల్లో మీకిష్టమైన చిత్రం ఏది?

మాధవన్‌: సఖి.

మీరు అద్భుతంగా నటించిన పాత్ర?

మాధవన్‌: నాకు తెలిసి ‘రాకెట్రీ’లో..

‘రాకెట్రీ’ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది?

మాధవన్‌: నేనూ దాని కోసమే ఎదురుచూస్తున్నా.

మైఖేల్‌ మాడిసన్‌తో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?

మాధవన్‌: మా ఇద్దరి మధ్య సన్నివేశాలు తక్కువ. అయినప్పటికీ అది ఓ మధుర జ్ఞాపకం.

తెలుగులో మిమ్మల్ని పాజిటివ్‌ రోల్‌లో చూడాలని ఉంది.

మాధవన్‌: అలాంటి పాత్ర ఒప్పుకొన్నా.. అతి త్వరలో మీ ముందుకు వస్తా.

సూర్య గురించి చెప్పండి?

మాధవన్‌: నాకిష్టమైన మంచి సోదరుడు.

ఒక పాత్ర కోసం ఎవరైనా దర్శకుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు కథ వినకుండా ఎప్పుడైనా సంతకం చేశారా? చేస్తే, ఆ దర్శకుడు ఎవరు?

మాధవన్‌: నేను దర్శకుడినైతేనే అది సాధ్యమవుతుంది.

స్వీటీతో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?

మాధవన్‌: చక్కటి అనుభవం.. ఆమె చాలా సౌమ్యమైన మహిళ.

‘నిశ్శబ్దం’ సినిమా విషయంలో మీకు కష్టంగా అనిపించిన విషయం?

మాధవన్‌: విడుదల విషయంలో తికమకగా అనిపించింది. కొవిడ్‌ నేపథ్యంలో చాలా రోజులు ఎదురుచూడాల్సి వచ్చింది.

‘నిశ్శబ్దం’ మీకు కథ నచ్చిందా? లేదా నటించాలని నటించారా?

మాధవన్‌: కొన్నిసార్లు విజయం సాధిస్తాం.. మరికొన్ని సార్లు పరాజయం చవిచూస్తాం. దీనికి మించి ఏం చెప్పగలను. మావంతు కృషి మేం చేశాం.

50 ఏళ్ల వయసులోనూ ఇంత అందంగా ఎలా ఉన్నారు? నిజంగా ఇది గొప్ప విషయం. ఎప్పటికైనా నా క్రష్‌ మీరే.
మాధవన్‌: ధన్యవాదాలు.. అదంతా మీరు చూసేదాన్ని బట్టి ఉంటుంది.

విజయ్‌ గురించి మీ అభిప్రాయం?
మాధవన్‌: అతడు అద్భుతమైన వ్యక్తి. నా కుటుంబ సభ్యుడితో సమానం.

ఇన్నేళ్లు అవుతున్నా అంతే అందంగా ఉన్నారు. మీ యంగ్‌ లుక్‌ వెనుక రహస్యం ఏంటి?
మాధవన్‌: మీకలా అనిపించడం నా అదృష్టం. కానీ నా అద్దం మీరు చెప్పిన మాటల్ని వ్యతిరేకిస్తోంది (నవ్వుతున్న ఇమోజీ).

షారుక్‌ ఖాన్‌ గురించి ఒక్కమాటలో చెప్పండి?
మాధవన్‌: ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వారు. నేను కూడా ఆయనకు అభిమానినే.

‘నిశ్శబ్దం’ సినిమాలో మీ నటన బాగుంది. ఆంటోనీ పాత్రలో మీకు నచ్చిన విషయం ఏంటి?
మాధవన్‌: అతడి గుండె పగిలింది.. కానీ ప్రమాదకరమైన వ్యక్తి.

మీ విజయం రహస్యం?

మాధవన్‌: నేనింకా నేర్చుకుంటున్నా..

ఎప్పుడూ ఇంత పాజిటివ్‌గా ఎలా ఉంటారు?

మాధవన్‌: అది అంత సులభం కాదు..

ఏ సినిమానైనా తిరస్కరించిన తర్వాత.. వదులుకున్నందుకు బాధపడ్డారా?
మాధవన్‌: అలాంటివి ఎప్పుడూ జరగలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని