రాశీఖన్నా ఫ్యామిలీలో పెళ్లి సందడి

నటి రాశీఖన్నా కుటుంబంలో పెళ్లి సందడి మొదలయ్యింది. నటికి సోదరి వరుసయ్యే కృతి మల్హోత్ర వివాహం సందర్భంగా రాశీ కుటుంబంలో సంతోషం నెలకొంది. వివాహ వేడుకల్లో భాగంగా తాజాగా బ్యాచిలరేట్‌ పార్టీ నిర్వహించారు. పార్టీలో పాల్గొన్న రాశీ..

Updated : 11 Dec 2020 14:43 IST

సోదరి బ్యాచిలరేట్‌ పార్టీలో నటి

హైదరాబాద్‌: నటి రాశీఖన్నా కుటుంబంలో పెళ్లి సందడి మొదలయ్యింది. నటికి సోదరి వరుసయ్యే కృతి మల్హోత్ర వివాహం సందర్భంగా రాశీ కుటుంబంలో సంతోషం నెలకొంది. వివాహ వేడుకల్లో భాగంగా తాజాగా బ్యాచిలరేట్‌ పార్టీ నిర్వహించారు. పార్టీలో పాల్గొన్న రాశీ.. కాబోయే వధువుతో సరదాగా గడిపారు. సోదరికి ముద్దుపెడుతున్న కొన్ని ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ‘‘నేను నిశ్శబ్దంగా ఉండలేను. ఎందుకంటే ఇది మా సోదరి వివాహ సమయం!!’’ అని ఆమె పేర్కొన్నారు. దీంతో పలువురు నెటిజన్లు రాశీ సోదరికి అభినందనలు తెలుపుతున్నారు.

‘ప్రతిరోజూ పండగే’, ‘వెంకీమామ‌’ చిత్రాలతో గతేడాది వరుస విజయాలను అందుకున్న రాశీఖన్నా ఈ ఏడాది ఆరంభంలో ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’తో ప్రేక్షకులను మెప్పించారు. ఇందులో ఆమె పోషించిన యామిని పాత్ర అభిమానుల్ని ఆకట్టుకుంది. ప్రస్తుతం రాశీ తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘మేధావి’, ‘తుగ్లక్‌ దర్బార్‌’ సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.

రాశీఖన్నా ఫొటోగ్యాలరీ

ఇవీ చదవండి
కాబోయేవాడి గురించి బయటపెట్టిన రకుల్‌

పోలవరంలో హీరోయిన్‌ అనుష్క


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని