Radheshyam: ప్రేమదే విజయం

ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. కె.రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించారు. గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ నిర్మించాయి. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, జయరామ్‌ కీలక పాత్రలు

Updated : 13 Mar 2022 08:35 IST

ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. కె.రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించారు. గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ నిర్మించాయి. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, జయరామ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలైన నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ప్రేక్షకుల ఆదరణ బాగుంది. ప్రభాస్‌, పూజాల నటన, కెమిస్ట్రీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. తమన్‌ నేపథ్య సంగీతంతో మ్యాజిక్‌ చేశారు’’ అన్నారు. ‘‘కథలో చక్కటి ప్రేమ ఉంది. అందరూ అన్నట్లుగానే ప్రేమే విజయం సాధించింది. ఈ స్క్రిప్ట్‌ ఎంచుకుని, చేసినందుకు ప్రభాస్‌కు హ్యాట్సాఫ్‌. చాలా మంది సినిమాని హాలీవుడ్‌ చిత్రాలతో పోలుస్తున్నారు’’ అన్నారు తమన్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని