సీనియర్‌ నటుడి వ్యాఖ్యలపై రాధిక ఫైర్‌

‘మీటూ’ ఉద్యమం గురించి బాలీవుడ్‌ ప్రముఖ నటుడు ముఖేశ్‌ ఖన్నా చేసిన వ్యాఖ్యలపై నటి రాధిక ఫైర్‌ అయ్యారు. మూర్ఖత్వంతో కొంతమంది అలా మాట్లాడతారని ఆమె అన్నారు. ‘శక్తిమాన్‌’గా గుర్తింపు తెచ్చుకున్న ముఖేశ్‌ ఖన్నా తాజాగా ‘మీటూ’ ఉద్యమం గురించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు....

Published : 01 Nov 2020 14:30 IST

చెన్నై: ‘మీటూ’ ఉద్యమం గురించి బాలీవుడ్‌ ప్రముఖ నటుడు ముఖేశ్‌ ఖన్నా చేసిన వ్యాఖ్యలపై నటి రాధిక ఫైర్‌ అయ్యారు. మూర్ఖత్వంతో కొంతమంది అలా మాట్లాడతారని ఆమె అన్నారు. ‘శక్తిమాన్‌’గా గుర్తింపు తెచ్చుకున్న ముఖేశ్‌ ఖన్నా తాజాగా ‘మీటూ’ ఉద్యమం గురించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతివిషయంలోనూ తాము పురుషులతో సమానమని స్త్రీలు ఆలోచించడం వల్లనే ‘మీటూ’ ఉద్యమం అనేది తెరపైకి వచ్చింది. ఇంటిని చక్కదిద్దడం మాత్రమే మహిళల పని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. 

గాయని చిన్మయి ముఖేశ్‌ని విమర్శిస్తూ ఓ ట్వీట్‌ పెట్టారు. ‘ఈ మధ్యకాలంలో కొంతమంది మానసిక ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తోంది. నిజాన్ని గ్రహించకుండా, పాత ధోరణిలోనే ఆలోచిస్తుంటారు. మహిళలు పనులు, ఉద్యోగాలు చేయడంవల్లే మీటూ ఉద్యమం ప్రారంభమైందని చెప్పిన ఆయన.. పురుషులు తమ హింసాత్మకమైన కోరికలను కంట్రోల్‌ చేసుకోకపోవడం వల్లే ఇలాంటివి కొనసాగుతున్నాయని చెప్పలేకపోయారు’ అని అన్నారు. నటి రాధిక సైతం ట్విటర్‌ వేదికగా.. ‘వారి మూర్ఖత్వపు మాటలు వింటుంటే భయంకరంగా అనిపిస్తోంది. ఇలాంటి మాటలకు దూరంగా ఉండడమే మంచిది’ అని రాధిక ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని