Raja Vikramarka: ఏజెంట్‌ మిషన్‌ షురూ

కార్తికేయ హీరోగా శ్రీ సరిపల్లి తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రం ‘రాజా విక్రమార్క’. ఆదిరెడ్డి, రామారెడ్డి నిర్మించారు. తాన్య రవిచంద్రన్‌ కథానాయిక. సాయికుమార్‌, తనికెళ్ల భరణి, సుధాకర్‌ కోమాకుల కీలక పాత్రలు

Updated : 02 Nov 2021 10:24 IST

కార్తికేయ హీరోగా శ్రీ సరిపల్లి తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రం ‘రాజా విక్రమార్క’. ఆదిరెడ్డి, రామారెడ్డి నిర్మించారు. తాన్య రవిచంద్రన్‌ కథానాయిక. సాయికుమార్‌, తనికెళ్ల భరణి, సుధాకర్‌ కోమాకుల కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నవంబర్‌ 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హీరో నాని చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రచార చిత్రం తీర్చిదిద్దిన తీరును బట్టి.. సినిమాలో యాక్షన్‌, వినోదానికి పెద్ద పీట వేసినట్లు అర్థమవుతోంది. ఇందులో కార్తికేయ ఎన్‌ఐఏ ఏజెంట్‌ విక్రమ్‌గా కనిపించారు. హోం మినిస్టర్‌ను ఓ ప్రమాదం నుంచి తప్పించడం కోసం అతను ఓ సీక్రెట్‌ మిషన్‌ చేపట్టడం.. ఈ క్రమంలో హోంమంత్రి కూతురుతో ప్రేమలో పడటం లాంటి సన్నివేశాల్ని ట్రైలర్‌లో చూపించారు. మరి విక్రమ్‌ తన మిషన్‌ను, ప్రేమను సాధించాడా? ఈ క్రమంలో అతనికెదురైన సవాళ్లేంటి? వాటినెలా ఎదుర్కొన్నాడు? అన్నది తెరపై చూడాలి. ‘‘పన్నెండేళ్ల అరణ్యవాసం, ఏడాది అజ్ఞాతవాసం చేశాక.. పాండవులు కోరుకుంది కౌరవుల చావు కాదు. ఓటమి’’, ‘‘ఇప్పుడు నాకు తెలియాల్సింది ఒకటే.. ట్రిగ్గర్‌ నొక్కనా, వద్దా?’’, ‘‘దీపావళికి బాగా గ్రాండ్‌గానే ప్లాన్‌ చేశావ్‌’’ అంటూ ట్రైలర్‌లో వినిపించిన సంభాషణలు ఆసక్తిరేకెత్తించేలా ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌. విహారి, ఛాయాగ్రహణం: పి.సి.మౌళి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని