Radheshyam: రాజమౌళి చెప్పనున్న ‘రాధేశ్యామ్‌’ కథ

ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘రాధేశ్యామ్‌’ మార్చి 11న ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణాది భాషలతోపాటు హిందీలోనూ చిత్రం విడుదలవుతోంది. హిందీలో ఈ సినిమా కథ అగ్ర

Updated : 28 Feb 2022 08:47 IST

ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘రాధేశ్యామ్‌’ మార్చి 11న ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణాది భాషలతోపాటు హిందీలోనూ చిత్రం విడుదలవుతోంది. హిందీలో ఈ సినిమా కథ అగ్ర కథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ వాయిస్‌ ఓవర్‌తో మొదలవుతుంది. తెలుగులో ‘రాధేశ్యామ్‌’ కథ అగ్ర దర్శకుడు రాజమౌళి గళంతో మొదలవుతుంది. అలా కన్నడలో శివరాజ్‌కుమార్‌, మలయాళంలో పృథ్వీరాజ్‌  సుకుమారన్‌, తమిళంలో సత్యరాజ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వనున్నట్టు చిత్రబృందం తెలిపింది. ‘‘1970 నేపథ్యంలో సాగే ఓ అందమైన ప్రేమకథ ఇది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఇటలీ, హైదరాబాద్‌లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరణ చేశాం. ఇటు దక్షిణాదిలోనూ, అటు ఉత్తరాదిలోనూ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దక్షిణాది భాషల్లోనూ, హిందీలోనూ వేర్వేరు సంగీత దర్శకులు పనిచేశారు. ఒకే సినిమాకి అలా వేర్వేరు సంగీత దర్శకులు స్వరాలు సమకూర్చడం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇదే తొలిసారి. ట్రైలర్‌కి చక్కటి స్పందన లభించింది. చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా నటించిన ఈ సినిమాని కె.కె.రాధాకృష్ణకుమార్‌ తెరకెక్కించారు. వంశీ, ప్రమోద్‌, ప్రసీధ నిర్మాతలు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని