Rajiniknath: రజనీకాంత్‌ కొత్త చిత్రం

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు. ‘అన్నాత్తే’ తర్వాత ఆయన నటిస్తారా? లేదా? అన్న ప్రశ్నలు జోరుగా వినిపిస్తున్న ప్రస్తుత తరుణంలో తదుపరి సినిమా గురించి ప్రకటించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. శివకార్తికేయన్‌తో ఇటీవల ‘డాక్టర్‌’ చిత్రాన్ని తెరకెక్కించిన నెల్సన్‌ దర్శకత్వంలో  రజనీకాంత్‌ నటించనున్నారు

Updated : 11 Feb 2022 10:03 IST

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు. ‘అన్నాత్తే’ తర్వాత ఆయన నటిస్తారా? లేదా? అన్న ప్రశ్నలు జోరుగా వినిపిస్తున్న ప్రస్తుత తరుణంలో తదుపరి సినిమా గురించి ప్రకటించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. శివకార్తికేయన్‌తో ఇటీవల ‘డాక్టర్‌’ చిత్రాన్ని తెరకెక్కించిన నెల్సన్‌ దర్శకత్వంలో  రజనీకాంత్‌ నటించనున్నారు. ఇది ఆయన 169వ చిత్రం. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం సమకూర్చుతున్నారు. ఏప్రిల్‌లో పూజ నిర్వహించి, మేలో చిత్రీకరణ మొదలుపెట్టనున్నారు. ‘కోలమావు కోకిల’తో దర్శకుడిగా అడుగుపెట్టిన నెల్సన్‌ ఆ తర్వాత శివకార్తికేయన్‌తో ‘డాక్టర్‌’ రూపొందించి వరుస విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం విజయ్‌తో ‘బీస్ట్‌’ తెరకెక్కిస్తున్నారు. తన నాలుగో చిత్రానికి ఏకంగా రజనీకాంత్‌ సినిమాకు దర్శకత్వం వహించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

- న్యూస్‌టుడే, కోడంబాక్కం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని