వర్మ ‘ పవర్ స్టార్’ ట్రైలర్ చూశారా?

సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న నూతన చిత్రం ‘ పవర్ స్టార్’. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని నెలలుగా సినిమాల విడుదల ఆగిపోయినా, వర్మ మాత్రం  వరుస చిత్రాలను ఓటీటీల వేదికగా విడుదల చేస్తూ, కొత్త చిత్రాలను ప్రకటిస్తూ ముందుకెళుతున్నారు. ...

Updated : 22 Jul 2020 11:41 IST

హైదరాబాద్: సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న నూతన చిత్రం ‘ పవర్ స్టార్’. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని నెలలుగా సినిమాల విడుదల ఆగిపోయినా, వర్మ మాత్రం  వరుస చిత్రాలను ఓటీటీల వేదికగా విడుదల చేస్తూ, కొత్త చిత్రాలను ప్రకటిస్తూ ముందుకెళుతున్నారు. 

ఈ నేపథ్యంలో ‘ పవర్ స్టార్’ పేరుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నా అంటూ సంచలనానికి తెరలేపారు వర్మ. ప్రకటించడమే కాదు ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఒక పాటను కూడా విడుదల చేశారు. డబ్బులు చెల్లించి ట్రైలర్ చూడాలంటూ అభిమానులు కోరిన ఆయన తాజాగా అది లీక్ అయిందంటూ మరో ప్రకటన చేసి నేరుగా తానే విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ట్రైలర్ చూసేందుకు డబ్బులు చెల్లించిన వారికి  వీలైనంత త్వరగా వెనక్కి ఇస్తామని తెలిపారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న పవర్ స్టార్ జూలై 25న https://www.rgvworldtheatre.com/ వేదికగా విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని