Ramarao On Duty: శివరాత్రికి రామారావు సందడి

రవితేజ కథానాయకుడిగా శరత్‌ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. దివ్యాంశ కౌశిక్‌, రజిషా విజయన్‌ కథానాయికలు. వేణు తొట్టెంపూడి ముఖ్యభూమిక పోషిస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. 

Updated : 27 Feb 2022 08:38 IST

రవితేజ కథానాయకుడిగా శరత్‌ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. దివ్యాంశ కౌశిక్‌, రజిషా విజయన్‌ కథానాయికలు. వేణు తొట్టెంపూడి ముఖ్యభూమిక పోషిస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 1న టీజర్‌ని విడుదల చేస్తున్నట్టు తెలుపుతూ ఓ పోస్టర్‌ని విడుదల చేశాయి సినీ వర్గాలు. ‘‘యథార్థ సంఘటనల స్ఫూర్తితో సిద్ధం చేసిన కథ ఇది. రవితేజ సరికొత్త గెటప్‌లో ఆకట్టుకునేలా కనిపిస్తారు. కథ, కథనాలు ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచుతాయ’’ని  సినీ వర్గాలు తెలిపాయి. ఇందులో రవితేజ ఓ ప్రభుత్వాధికారి పాత్రలో కనిపిస్తారు. నాజర్‌, సీనియర్‌ నరేష్‌, పవిత్ర లోకేష్‌, ‘సర్పట్ట’ జాన్‌విజయ్‌, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్‌ రామకృష్ణ, శ్రీ, మధుసూధన్‌రావు, సురేఖవాణి నటించిన ఈ చిత్రానికి సంగీతం: శామ్‌ సీఎస్‌, ఛాయాగ్రహణం: సత్యన్‌ సూర్యన్‌, కూర్పు: ప్రవీణ్‌ కేఎల్‌, కళ: సాహి సురేష్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని