ఈ ఏడాదిలోనే రానా వివాహం: సురేశ్‌బాబు

ఈ ఏడాదిలోనే తన కుమారుడు రానా దగ్గుబాటి వివాహం జరగబోతోందని ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడారు. రానా, మిహీకా బజాజ్‌ చాలా ఏళ్లుగా స్నేహితులని పేర్కొన్నారు. ‘ఇటువంటి కష్ట సమయంలోనూ సెలబ్రేషన్స్‌.....

Published : 13 May 2020 16:37 IST

‘చాలా రోజులుగా వారికి పరిచయం ఉంది‘

హైదరాబాద్‌: ఈ ఏడాదిలోనే తన కుమారుడు రానా దగ్గుబాటి వివాహం జరగబోతోందని ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడారు. రానా, మిహీకా బజాజ్‌ చాలా ఏళ్లుగా స్నేహితులని పేర్కొన్నారు. ‘ఇటువంటి కష్ట సమయంలోనూ సెలబ్రేషన్స్‌ చేసుకోవడానికి మాకు కారణం లభించింది. మొత్తం కుటుంబం చాలా సంతోషంగా ఉంది. చాలా కాలం నుంచి పిల్లలకు (రానా, మిహీక) పరిచయం ఉంది. వారి పట్ల మేం చాలా ఆనందంగా ఉన్నాం. ఈ ఏడాదిలోనే రానా వివాహం జరగబోతోంది. డిసెంబరులో పెళ్లి నిర్వహించాలని అనుకుంటున్నాం. కానీ దాని కన్నా ముందే వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. అన్నీ కుదిరిన తర్వాత మేమే వివరాలు వెల్లడిస్తాం. ఈ లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకోవడానికి పిల్లలు మాకు అవకాశం ఇచ్చారు. పెళ్లి ఏర్పాట్లు ఎలా చేయాలనే దానిపై ఇప్పుడు ప్లాన్‌ చేసుకుంటున్నాం’ అని ఆయన తెలిపారు.

తన ప్రేమను మిహీకా బజాజ్‌ అంగీకరించారని ప్రకటిస్తూ రానా మంగళవారం అందరికీ షాక్ ఇచ్చారు. దీంతోపాటు తన ప్రేయసి ఫొటో పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖులంతా రానాకు శుభాకాంక్షలు చెప్పారు. మిహీక స్వస్థలం హైదరాబాద్‌. ఆమె ‘డ్యూ డ్రాప్‌ స్టూడియో’ అనే ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీని నడుపుతున్నారు. రానా, మిహీకా కొంత కాలంగా ప్రేమలో ఉన్నట్టు సమాచారం. తాజాగా వీరి బంధానికి పెద్దల ఆమోదం లభించడంతో పెళ్లికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి..

రానా ప్రేయసి ఎవరో.. ఏం చేస్తారో తెలుసా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని