‘నాన్నే నా స్ఫూర్తి’: రణ్‌బీర్‌ కపూర్‌

బాలీవుడ్ యువ కథానాయకుడు రణ్‌బీర్‌ కపూర్‌ తన తండ్రి రిషికపూర్‌ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భావోద్వేగానికి

Published : 25 Dec 2020 20:47 IST

ముంబయి: బాలీవుడ్ యువ కథానాయకుడు రణ్‌బీర్‌ కపూర్‌ తన తండ్రి రిషికపూర్‌ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. రెండు సంవత్సరాలు లుకేమియా క్యాన్సర్‌తో బాధపడిన రిషి కపూర్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన తండ్రితో ఆస్పత్రిలో ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు. 

‘‘నా తండ్రి లేకుండా జీవించడం నేను కలలో కూడా ఊహించలేదు. నా జీవితంలో ఈ సంవత్సరం మరిచిపోలేని బాధను మిగిల్చింది. ఆయన మరణించే ముందు వరకు రెండేళ్లు కీమోథెరపీ చేయించాం. మేమిద్దరం కలిసి హోటల్‌ రూమ్ నుంచి ఆస్పత్రికి మౌనంగా నడిచేవాళ్లం. అంతా చాలా వేగంగా జరిగిపోయింది. వ్యక్తిగతంగా, ప్రొఫెషన్‌ పరంగా నా జీవితంలో ఆయన ప్రభావం ఎంతో ఉంటుంది. ఆయన నాకు నేర్పించిన విలువలే నేను ఈ రోజు ఇంతటి స్థాయిలో ఉండటానికి కారణం’’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి..

క్రిస్మస్‌ తెచ్చింది కొత్త సినిమా పోస్టర్ల హంగామా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని