కంగనకు ఓ రూల్‌.. మీకో రూలా?

బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌ గత కొన్ని రోజులుగా పలు అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ ప్రముఖులు, సుశాంత్‌ మరణం, డ్రగ్స్‌ వ్యవహారం, మహారాష్ట్ర ప్రభుత్వం తీరు.. ఇలా అనేక విషయాలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సీనియర్‌ నటి షబానా అజ్మీ

Published : 07 Oct 2020 13:51 IST

సీనియర్‌ నటిపై రంగోలీ ఘాటు వ్యాఖ్యలు

ముంబయి: బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌ గత కొన్ని రోజులుగా పలు అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ ప్రముఖులు, సుశాంత్‌ మరణం, డ్రగ్స్‌ వ్యవహారం, మహారాష్ట్ర ప్రభుత్వ తీరు.. ఇలా అనేక విషయాలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సీనియర్‌ నటి షబానా అజ్మీ మీడియాతో మాట్లాడుతూ.. ‘వార్తల్లో ఎప్పుడూ ఉండాలనేది కంగన కోరిక’ అని పరోక్షంగా విమర్శించారు. దీంతో కంగన సోదరి రంగోలీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. షబానా అజ్మీని ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడారు.

‘ప్రియమైన షబానా జీ.. మిమ్మల్ని, మీ భర్తను కొన్ని ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నా. మీరిద్దరు మీకు సంబంధించిన నటన, కవిత్వం గురించి మాత్రమే ఆలోచించకుండా.. మిగిలిన విషయాల్ని కూడా ఎందుకు పట్టించుకుంటున్నారు? భారత వ్యతిరేక రాజకీయాల్లో ఎందుకు చురుకుగా పాల్గొంటున్నారు?.. వార్తల్లో నిలవడం కోసమా? లేక ఆ అంశాల గురించి పట్టించుకోవడమా?.. మీ భారత వ్యతిరేక అజెండాలు నిజాయితీవైతే.. భారత్‌కు అనుకూలంగా ఉండే కంగన అజెండాలు కూడా నిజాయితీతో కూడుకున్నవే. ఆమెకు ఓ రకమైన రూల్‌, మీకో రకమైన రూలా?’ అని రంగోలీ ఘాటుగా ప్రశ్నించారు.

కంగనను వ్యతిరేకిస్తూ ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో షబానా అజ్మీ మాట్లాడుతూ.. ‘కంగన తన పురాణాన్ని (కల్పిత విషయాల్ని) తాను నమ్ముతోంది. చిత్ర పరిశ్రమకు స్త్రీవాదాన్ని పరిచయం చేసింది తానే అని భావిస్తోంది. పత్రికల్లో తన పేరు ఉండదేమోనని భయపడినట్లుంది. అందుకే వార్తల్లో ఉండేందుకు ఇలాంటి కామెంట్లు చేస్తోంది. అమాయకురాలు.. తనకు వచ్చిన నటన మాత్రమే చేసుకుంటూ ఎందుకు ఉండటం లేదో..’ అని అన్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts