సుమ ప్రోగ్రామ్‌లో రష్మి సందడి

సుమ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘స్టార్ మహిళ’ ప్రోగ్రామ్‌లో తాజాగా రష్మి సందడి చేశారు. ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ కామెడీ షోలో భాగంగా రష్మి.. ‘స్టార్‌ మహిళ’ సెట్‌లోకి అడుగుపెట్టారు. ఇటీవల 300 ఎపిసోడ్‌తో ప్రేక్షకులను ఎంతగానో...

Published : 23 Oct 2020 23:36 IST

హైదరాబాద్‌: సుమ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘స్టార్ మహిళ’ ప్రోగ్రామ్‌లో తాజాగా రష్మి సందడి చేశారు. ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ కామెడీ షోలో భాగంగా రష్మి.. ‘స్టార్‌ మహిళ’ సెట్‌లోకి అడుగుపెట్టారు. ఇటీవల 300 ఎపిసోడ్‌తో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ టీమ్స్‌ తాజా పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమైంది. సుడిగాలి సుధీర్‌, బుల్లెట్‌ భాస్కర్‌ టీమ్స్‌ వేసిన పంచులు నవ్వులు పూయించేలా ఉన్నాయి. రాకేష్‌ స్కిట్‌లో భాగంగా హైపర్‌ ఆది ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’లో సందడి చేశారు. శుక్రవారం(అక్టోబర్‌ 23) ప్రసారం కానున్న ఈ ప్రోగ్రామ్‌ ప్రోమో చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని