తెలుగు స్టార్‌హీరోయిన్‌ బాలీవుడ్‌ ఎంట్రీ

తెలుగులో స్టార్‌హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్‌, తమన్నా, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ తమ లక్‌ను పరీక్షించుకోవడానికి ఒకానొక సమయంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వారి అడుగుజాడల్లోనే  మరో స్టార్‌ హీరోయిన్ చేరింది....

Updated : 23 Dec 2020 14:23 IST

ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ షేర్‌ చేసిన నటి

హైదరాబాద్‌: తెలుగులో స్టార్‌హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్‌, తమన్నా, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ తమ లక్‌ను పరీక్షించుకోవడానికి ఒకానొక సమయంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వారి అడుగుజాడల్లోనే  మరో స్టార్‌ హీరోయిన్ చేరింది. ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ చిత్రాలతో ఈ ఏడాది ఆరంభంలోనే రెండు విజయాలను తన ఖాతాలో వేసుకున్న నటి రష్మిక బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. యువ కథానాయకుడు సిద్ధార్థ్‌ మల్హోత్ర హీరోగా తెరకెక్కుతున్న ‘మిషన్‌ మజ్ను’ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ‘మిషన్‌‌ మజ్ను’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రష్మిక అభిమానులతో పంచుకుంది.

‘‘మిషన్‌‌ మజ్ను’ చిత్రంలో నేను కూడా ఓ భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఈ సినిమాతో కొత్త ప్రయాణం ప్రారంభమవుతుందని చెప్పడం నాకెంతో ఆనందంగా ఉంది. భారత్‌ రా ఏజెన్సీ పాకిస్థాన్‌లో చేపట్టిన అత్యంత సాహసోపేతమైన మిషన్ కథతో ‘మిషన్‌‌ మజ్ను’ చిత్రం తెరకెక్కుతుంది’ అని రష్మిక పేర్కొంది. షాంతను భాగ్చీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు కన్నడ చిత్రం ‘కిర్రాక్‌ పార్టీ’తో 2016లో కథానాయికగా వెండితెరకు పరిచయమైన రష్మిక మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్ని అలరించారు. 2018లో విడుదలైన ‘ఛలో’తో ఆమె తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. అదే ఏడాదిలో విడుదలైన ‘గీతగోవిందం’, ‘దేవదాస్‌’.. 2019లో వచ్చిన ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రాలు రష్మికకు గుర్తింపు తెచ్చిపెట్టాయి.

ఇవీ చదవండి

అప్పట్లో ఇంటి నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు..!

విజయశాంతి ఇచ్చిన సలహా అది!

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని