Ravanasura: ‘రావణాసుర’ కోసం రంగంలోకి

‘రావణాసుర’ సినిమా కోసం రంగంలోకి దిగారు కథానాయకుడు రవితేజ. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్‌, పూజిత పొన్నాడ కథానాయికలు. సుశాంత్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Updated : 03 Feb 2022 07:40 IST

‘రావణాసుర’ సినిమా కోసం రంగంలోకి దిగారు కథానాయకుడు రవితేజ. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్‌, పూజిత పొన్నాడ కథానాయికలు. సుశాంత్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా రెండో షెడ్యూల్‌ బుధవారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా రవితేజతో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. రవితేజ సెట్లోకి అడుగు పెట్టిన వీడియో, ఫొటోలను చిత్ర బృందం సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘‘విభిన్నమైన థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో రవితేజ న్యాయవాదిగా కనిపించనున్నారు. రామ్‌ పాత్రలో సుశాంత్‌ కనిపిస్తారు. సినిమాలో ఐదుగురు నాయికలకూ ప్రాధాన్యముంటుంది’’ అని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమా సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: హర్ష వర్దన్‌ రామేశ్వర్‌, భీమ్స్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ కార్తీక్‌ కన్నన్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని