Updated : 28/12/2020 18:02 IST

రవితేజ అభిమానులకు న్యూఇయర్‌ గిఫ్ట్‌ ఇదే!

హైదరాబాద్: మాస్‌ మహారాజా రవితేజ, అందాల నటి శృతి హాసన్ కలిసి నటిస్తున్న చిత్రం ‘క్రాక్‌’. గోపీచంద్ మలినేని దర్శకుడు. తమన్ ఈ చిత్రానికి బాణీలు అందించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు విడుదలై ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఇటీవలే చిత్ర బృందం పాటల చిత్రీకరణకు గోవా వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వరుస క్రైం ఘటనల ఆధారంగా తెరకిక్కిన ఈ చిత్రం 2021 జనవరి 14న సంక్రాంతి కానుకగా థియేటర్లలో ప్రేక్షకులకు కనువిందు చేయడానికి సిద్ధమవుతోంది. రవితేజ, గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘డాన్‌ శీను’, ‘బలుపు’ చిత్రాలు అభిమానుల నుంచి మంచి మార్కులు కొట్టేశాయి. వీరిద్దరి కలయికలో వస్తున్న హ్యాట్రిక్‌ చిత్రం కావడంతో ‘క్రాక్‌’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని