ప్రముఖ దర్శకుడికి గుండెపోటు

బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ రెమో డిసౌజాకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు ముంబయిలోని కోకిలాబెన్‌ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స....

Updated : 11 Dec 2020 20:53 IST

ముంబయి: బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ రెమో డిసౌజాకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు ముంబయిలోని కోకిలాబెన్‌ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ‘రెమోకు శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటు వచ్చింది. ఆసుపత్రిలో చేర్పించాం. రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడినట్లు తెలిసింది. ఆయన ప్రస్తుతం ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది’ అని సన్నిహితులు తెలిపారు.

బాలీవుడ్‌లోని ప్రముఖ కొరియోగ్రాఫర్లలో రెమో ఒకరు. ఆయన ‘తుమ్‌ బిన్‌’, ‘కాంటే’, ‘ధూమ్‌’, ‘రాక్‌ ఆన్‌’, ‘యే జ‌వానీ హై దీవానీ’, ‘క్రిష్‌ 3’, ‘2 స్టేట్స్‌’, ‘బాజీరావ్‌ మస్తానీ’, ‘దీల్‌వాలే’, ‘జీరో’, ‘కలంక్‌’, ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ తదితర సినిమాల కోసం పనిచేశారు. దర్శకుడిగా ‘F.A.L.T.U’, ‘ఏబీసీడీ’, ‘ఏ ఫ్లయింగ్ జట్’, ‘రేస్‌ 3’, ‘స్ట్రీట్‌ డ్యాన్సర్‌’ తదితరు సినిమాలు తెరకెక్కించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని