తన లవ్‌స్టోరీ బయటపెట్టిన రోజా

నటి రోజా తన ప్రేమకథను బయటపెట్టి ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ఆర్‌.కే.సెల్వమణి అనే దర్శకుడిని ప్రేమించిన ఆమె పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని.. సంతోషకరమైన జీవితాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఆమె న్యాయనిర్ణేతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’.....

Published : 09 Nov 2020 02:03 IST

ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్న నటి

హైదరాబాద్‌: నటి రోజా తన ప్రేమకథను బయటపెట్టి ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ఆర్‌.కే.సెల్వమణి అనే దర్శకుడిని ప్రేమించిన ఆమె పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని.. సంతోషకరమైన జీవితాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఆమె న్యాయనిర్ణేతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’. రష్మి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కామెడీ షోకి సంబంధించిన సరికొత్త ప్రోమో ప్రస్తుతం ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది.

అమాయకపు భార్య, అందమైన మరదలు ఉంటే ఒక భర్త పరిస్థితి ఎలా ఉంటుందో సరదాగా తెలియజేస్తూ రాకేష్‌ చేసిన స్కిట్‌తో రోజా పడిపడి నవ్వుకున్నారు. స్కిట్‌లో భాగంగా ప్రభాస్‌ని ఇమిటేట్‌ చేస్తూ బుల్లెట్‌ భాస్కర్‌ పలికించిన హావభావాలు.. దానికి అనుగుణంగా నరేశ్‌‌ వేసే పంచులు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎంతో సరదాగా సాగుతోన్న ఎపిసోడ్‌లో సరదా సత్తిపండు అదుర్స్‌ ఆనంద్‌ చేసిన స్కిట్ రోజాకి ఆనాటి రోజుల్ని గుర్తు చేశాయి. స్కిట్‌లో భాగంగా రోజా-సెల్వమణి ప్రేమకథను స్టేజ్‌పై ఆవిష్కరించి.. పంచులతో నవ్వులు పూయించారు. స్కిట్‌ అనంతరం రోజా తన ప్రేమ కథ గురించి చెబుతూ.. ‘సెల్వమణి డైరెక్ట్‌గా నాకు ప్రపోజ్‌ చేయలేదు. మొదట మా ఇంట్లోవాళ్లకి చెప్పి వాళ్లు ఓకే అన్నాక.. ‘సీతారత్నంగారి అబ్బాయి’ షూటింగ్‌ టైమ్‌లో నా దగ్గరకి వచ్చి ‘ఐ లవ్‌ యూ. మన పెళ్లికి మీ ఇంట్లో ఒప్పుకున్నారు.’ అని చెప్పారు’ అని రోజా మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వచ్చే శుక్రవారం (నవంబర్‌ 13) ప్రసారం కానున్న ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ ప్రోమో చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని