Runway 34: ‘రన్‌వే 34’ టీజర్‌ చూశారా?

బాలీవుడ్‌లో మరో ఆసక్తికర చిత్రం ప్రేక్షకులను అలరించడానికి రానుంది. అగ్ర కథానాయకులు అమితాబ్‌ బచ్చన్‌, అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆ చిత్రమే ‘రన్‌వే 34’. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కీలక పాత్రలో కనిపించనుంది.

Published : 15 Mar 2022 15:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌లో మరో ఆసక్తికర చిత్రం ప్రేక్షకులను అలరించడానికి రానుంది. అగ్ర కథానాయకులు అమితాబ్‌ బచ్చన్‌, అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆ చిత్రమే ‘రన్‌వే 34’. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కీలక పాత్రలో కనిపించనుంది. అజయ్‌ దేవగణ్‌ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. 2015లో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. మంగళవారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.  విమానయాన రంగం చుట్టూ తిరిగే ఈ కథలో అజయ్‌, రకుల్‌ పైలట్లుగా, అమితాబ్‌ విచారణాధికారిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈద్‌ సందర్భంగా ఏప్రిల్‌ 29న విడుదల చేయనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని