విషమంగానే ఎస్పీ బాలు ఆరోగ్యం

కరోనాతో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశాయి. ఎస్పీ బాలుకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని...

Published : 19 Aug 2020 17:56 IST

చెన్నై: కరోనాతో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశాయి. ఎస్పీ బాలుకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని.. నిపుణుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని ఎంజీఎం వైద్యులు పేర్కొన్నారు.

ఎస్పీబీ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని సినీ పరిశ్రమకు చెందిన వారితో పాటు సంగీతప్రియులూ ఆగస్టు 20న సామూహిక ప్రార్థనలు చేయాలని తమిళ సినీ పెద్దలు కోరారు. ప్రముఖ నటులు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, దర్శకుడు భారతీరాజా, సంగీత దర్శకులు ఇళయరాజా, ఏఆర్‌ రెహమాన్‌, రచయిత వైరముత్తు కలిసి ఓ ప్రకటన విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని