ఆ నాడు స్థోమత లేదు: సమంత

అందం, అభినయం, వీటికితోడు మంచితనం. ఈ గుణాలు సమంతను అభిమానులకు మరింత చేరువ చేసి.. అగ్ర కథానాయికగా మార్చాయి. ఇప్పటికే సామ్‌ నటిగా పలు సంస్థలకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆమె స్వయంగా ‘సాకి’ (saaki) అనే....

Updated : 05 Sep 2020 17:25 IST

‘ఇది భావోద్వేగంతో కూడిన ప్రయాణం’
బిజినెస్‌లో అడుగుపెట్టిన నటి

హైదరాబాద్‌: అందం, అభినయం, వీటికితోడు మంచితనం. ఈ గుణాలు సమంతను అభిమానులకు మరింత చేరువ చేసి.. అగ్ర కథానాయికగా మార్చాయి. ఇప్పటికే సామ్‌ నటిగా పలు సంస్థలకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆమె స్వయంగా ‘సాకి’ (saaki) అనే దుస్తుల బ్రాండ్‌ను స్థాపించారు. శనివారం మధ్యాహ్నం ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా ఫాలోవర్స్‌తో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. త్వరలోనే తన బ్రాండ్‌కు చెందిన డిజైనర్‌ దుస్తులు మార్కెట్‌లోకి రాబోతున్నట్లు తెలిపారు. అంతేకాదు ఒకప్పటి తన పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. ‘‘సాకి’.. నేను, నా బేబీ (చైతన్య) గత కొన్ని నెలలుగా దీని కోసం కలలు కంటున్నాం. ఇది నాకు ఫ్యాషన్‌పై ఉన్న అభిరుచిని, నా జీవిత ప్రయాణాన్ని తెలిపే బ్రాండ్‌’.

‘నేను నటిగా సినీ కెరీర్‌ను ఆరంభించడానికి ముందు.. మ్యాగజైన్‌లోని మోడల్స్‌ ఫ్యాషన్‌, వారి స్టైల్‌ను ఆసక్తిగా గమనించేదాన్ని. కాలేజీ చదువుతున్న రోజుల్లో ఓ డిజైనర్‌ డ్రెస్‌ కొనే స్థోమత లేకపోవడం నాకింకా గుర్తుంది. కానీ నటిగా మారిన తర్వాత ఎందరో ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులు ధరించే అవకాశం లభించడం నా అదృష్టం. చాలా ఏళ్ల తర్వాత నేను నా సంతకం ఉన్న డిజైనర్‌ డ్రెస్‌ను ధరించా. ఇది నాకు భావోద్వేగంతో కూడుకున్న ప్రయాణం. మీరంతా కురిపించిన ప్రేమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. ఈ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవాలి అనుకుంటున్నా. మన స్నేహాన్ని పంచుకోవడానికి ‘సాకి’ ఓ మార్గం. త్వరలోనే దీన్ని ప్రారంభించబోతున్నా. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని సామ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. ఇదే సందర్భంగా తను స్వయంగా దుస్తుల రంగులు, డిజైన్‌ను ఎంపిక చేస్తున్న వీడియోను షేర్‌ చేశారు. అంతేకాదు ‘సాకి’ టైటిల్‌ లోగోలో సామ్‌, చైతన్య చేతికి వేయించుకున్న టాటూను ఉంచారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని