ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లో సాయితేజ్‌, మారుతి

లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన థియేటర్లు ఎనిమిది నెలల తర్వాత శుక్రవారం రీఓపెన్‌ అయ్యాయి. ఎంతోకాలంగా థియేటర్లను మిస్‌ అయిన పలువురు సెలబ్రిటీలు సినిమా చూసేందుకు మల్టీప్లెక్స్‌ల బాటపట్టారు. అలా నేడు  విడుదలైన హాలీవుడ్‌ చిత్రం ‘టెనెట్‌‌’ను వీక్షించేందుకు దర్శకుడు మారుతి ప్రసాద్‌...

Updated : 04 Dec 2020 11:14 IST

ఫొటోలు షేర్‌ చేసిన దర్శకుడు

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన థియేటర్లు ఎనిమిది నెలల తర్వాత శుక్రవారం తిరిగి తెరుచుకున్నాయి. ఎంతోకాలంగా థియేటర్లను మిస్‌ అయిన పలువురు సెలబ్రిటీలు సినిమా చూసేందుకు మల్టీప్లెక్స్‌ల బాటపట్టారు. అలా నేడు  విడుదలైన హాలీవుడ్‌ చిత్రం ‘టెనెట్‌‌’ను వీక్షించేందుకు దర్శకుడు మారుతి.. ప్రసాద్‌ ఐమ్యాక్స్‌కు వెళ్లారు. తన స్నేహితులతో కలిసి థియేటర్‌లో తీసుకున్న పలు ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘ఎట్టకేలకు మేము సినిమాకు వచ్చాం. ఇది సురక్షితం, సరదాగా ఉంది. థియేటర్లకు రావడం చూస్తుంటే.. మరలా మా జీవితాల్లోకి వచ్చేసినట్లు అనిపిస్తుంది. మీరు కూడా సినిమాని థియేటర్లలో వీక్షించి ఎంజాయ్‌ చేయండి’ అని మారుతి పేర్కొన్నారు.

ప్రేక్షకుల్ని థియేటర్లకు ఆహ్వానిస్తూ సాయిధరమ్‌ తేజ్‌ ఓ స్పెషల్‌ వీడియోని షేర్‌ చేశారు. ఈ మేరకు ఆయన ప్రసాద్‌ ఐమ్యాక్స్‌ చేరుకుని.. ప్రతి ఒక్కరూ తిరిగి థియేటర్లకు రావాలని కోరుతూ ఓ వీడియోని అభిమానులతో పంచుకున్నారు. ‘చాలాకాలం తర్వాత థియేటర్లకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. వెండితెరపై సినిమాని చూడడమే నా దృష్టిలో ఓ అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్‌. నాలాగానే చాలామందికి కూడా ఇలాంటి భావనే ఉంటుందని నాకు తెలుసు. సినిమాని మరలా సెలబ్రేట్‌ చేసుకుందాం. కాకపోతే థియేటర్‌కు వచ్చేముందు తప్పకుండా మాస్క్‌లు ధరించండి. అలాగే చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసుకోండి’ అని సాయిధరమ్‌ తేజ్‌ తెలిపారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts