
మాట నిలబెట్టుకున్న సాయిధరమ్ తేజ్
ప్రశంసిస్తోన్న నెటిజన్లు
హైదరాబాద్: కథానాయకుడు సాయిధరమ్ తేజ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. దీంతో నెటిజన్లు, సినీ ప్రముఖులు ఆయన్ని అభినందిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావడంతో నిలిచిపోయిన వృద్ధాశ్రమ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి, ఆర్థికంగా కానీ వస్తు రూపంలో కానీ సాయం చేయాలని కోరుతూ గతేడాది విజయవాడకు చెందిన ‘అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ’ పలువురు సెలబ్రిటీలతోపాటు సాయితేజ్‌ను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది. అయితే సదరు ట్వీట్‌పై స్పందించిన సాయిధరమ్ తేజ్.. వృద్ధాశ్రమాన్ని తాను నిర్మించి ఇస్తానని.. అలాగే ఒక సంవత్సరం పాటు ఆశ్రమంలో అయ్యే ఖర్చులను కూడా తానే భరిస్తానని చెప్పారు.
కాగా, తాజాగా సదరు భవన నిర్మాణం పూర్తయింది. ఈ విషయాన్ని తెలియచేస్తూ ఆశ్రమం ఫొటోని హీరో సన్నిహితులు ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. చెప్పినట్టుగానే అమ్మ ఆదరణ సేవా వృద్ధాశ్రమం కోసం భవన నిర్మాణాన్ని పూర్తి చేయించారు.’ అని పేర్కొన్నారు. అయితే సాయిధరమ్ తేజ్ చేసిన మంచి పని గురించి తెలుసుకున్న సినీ ప్రముఖులు, నెటిజన్లు.. ఆయన సేవా గుణాన్ని కొనియాడుతూ కామెంట్లు పెడుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.