Updated : 20/10/2020 18:14 IST

పోలీసు అవ్వాలనే కోరిక ఉండేది: సాయికుమార్‌


 

తిరుమల: విధి నిర్వహణలో అమరులైన పోలీసులే నిజమైన హీరోలని నటుడు సాయికుమార్‌ అన్నారు. షూటింగ్‌ నిమిత్తం తిరుపతి వెళ్లిన ఆయన సతీసమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని మంగళవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న సాయికుమార్‌ దంపతులకు తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను మీడియాతో సాయికుమార్‌ పంచుకున్నారు.  

కరోనా ప్రభావంతో ఆగిపోయిన చిత్ర నిర్మాణం మళ్లీ మొదలైందని తెలిపారు. తిరుపతి పరిసరాల్లో జరుగుతున్న ‘శ్రీకారం’ చిత్ర షూటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చానని.. ఈ చిత్రంలో శర్వానంద్‌ హీరో అని తెలిపారు. స్వామివారి ఆశీస్సులు పొందినట్లు చెప్పారు. తాను నటించిన ‘పోలీసు స్టోరీ’ చిత్రం రేపటితో 24 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోందని, ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పోలీసు అధికారిని అవ్వాలని కోరిక ఉండేదని సాయి కుమార్‌ తెలిపారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని