అధీర పాత్ర డిజైన్‌ వెనుక..

ఇటీవల సంజయ్‌దత్‌ పుట్టినరోజు సందర్భంగా కేజీఎఫ్: చాప్టర్‌-2లోని ఆయన పాత్రను చిత్ర బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్‌-1లోని గరుడను మించిన క్రూరుడిగా ఆ పాత్ర రూపం ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే, వైకింగ్‌ లుక్‌లో సంజయ్‌దత్‌ స్టిల్‌తో

Updated : 04 Aug 2020 10:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల సంజయ్‌దత్‌ పుట్టినరోజు సందర్భంగా కేజీఎఫ్: చాప్టర్‌-2లోని ఆయన పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు కేజీఎఫ్‌-1లోని గరుడను మించిన క్రూరుడిగా ఆ పాత్ర రూపం ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే, వైకింగ్‌ లుక్‌లో సంజయ్‌దత్‌ స్టిల్‌తో ఆ అనుమానాలన్నీ పటాపంచలు అయ్యాయి. ఈ పాత్ర ఆహార్యంపై సంజయ్‌ దత్‌ ఎంతో శ్రద్ధ చూపారని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెలిపారు.

‘‘అధీర పాత్రను చూస్తే ఎవరైనా భయపడిపోవాలన్నట్లు ఉండాలని మేం  అనుకున్నాం. అందుకే వైకింగ్‌ లుక్‌వైపు మొగ్గు చూపాం. ఇదే విషయాన్ని సంజయ్‌ సర్‌కు చెబితే, అందుకు తగినట్లు మారడానికి ఎంతో కష్టపడ్డారు. మాకు ఎంతో సాయం చేశారు. ఈ విషయంలో ఆయన ఎంతో శ్రద్ధ చూపారు’’ అని ప్రశాంత్‌ నీల్‌ పేర్కొన్నారు.

తొలి భాగంగా అధీర పాత్రను అసలు చూపించలేదు. కేవలం సింహపు ఉంగరం ధరించిన వ్యక్తిని ముఖం కనపడనీయకుండా చూపించారు. దీంతో ఆ పాత్ర ఎవరు చేస్తారన్న ఆసక్తి నెలకొంది. కేజీఎఫ్‌-2 మొదలు పెట్టగానే సంజయ్‌ ఆ పాత్ర చేస్తారనే సరికి మరింత ఆసక్తి నెలకొంది. దీనిపై కూడా ప్రశాంత్‌ మాట్లాడారు. ‘‘కేజీఎఫ్‌-1 తీసే సమయంలో మాకు చాలా అడ్డంకులు, అవరోధాలు ఉన్నాయి. అయితే సినిమా విజయం సాధించిన తర్వాత రెండో భాగంపై మరింత దృష్టి పెట్టాం. ప్రేక్షకులు దీన్ని ఎంతో ఆసక్తితో గమనిస్తారని మాకు తెలుసు. ఇక ఇందులో ఎలాంటి సందేహం లేదు. చాప్టర్‌-2 అత్యుత్తమంగా ఉంటుంది’’ అని వివరించారు.

యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్‌: చాప్టర్‌1’ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్‌: చాప్టర్‌2’ను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ఇందులో ‘అధీర’ పాత్రను పోషిస్తున్నారు. చాప్టర్‌-1లో అనే ప్రశ్నలకు సమాధానం లభించనుంది. గరుడను చంపడానికి కేజీఎఫ్‌లోకి అడుగుపెట్టిన రాఖీ ఆ తర్వాత దాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? కేజీఎఫ్‌ను దక్కించుకోవడానికి ప్రయత్నించిన రాజేంద్ర దేశాయ్‌, కమల్‌, గురు పాండ్యన్‌, ఆండ్రూస్‌లను ఎలా ఎదుర్కొన్నాడు? గరుడ చనిపోయిన వార్త తెలిసిన అధీర, ఇనాయత్‌ ఖలీలు ఏం చేశారు? కేజీఎఫ్‌ను దక్కించుకున్న  రాఖీని అంతం చేయడానికి భారత ప్రభుత్వం ఏం చేసింది? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయిక.  ప్రధానిగా రవీనా టాండన్‌ నటిస్తుండగా, ఓ కీలక పాత్రలో తెలుగు నటుడు రావు రమేశ్‌ నటిస్తున్నారు. హోంబాలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అలరించనుంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని