సమస్యలో ఉందని లవర్‌ని వదిలేస్తే..

‘అమ్మాయి అందంగా ఉందని ప్రేమించి తర్వాత ప్రాబ్లమ్‌లో ఉందని వదిలేస్తే అది ప్రేమ ఎలా అవుతుంది’ అని అంటున్నారు నటుడు ఆది. ఆయన కథానాయకుడిగా నటించిన లవ్‌, యాక్షన్‌ డ్రామా...

Updated : 18 Aug 2022 11:01 IST

ఆకట్టుకునేలా ‘శశి’ టీజర్‌

హైదరాబాద్‌: ‘అమ్మాయి అందంగా ఉందని ప్రేమించి తర్వాత ప్రాబ్లమ్‌లో ఉందని వదిలేస్తే అది ప్రేమ ఎలా అవుతుంది’ అని అంటున్నారు నటుడు ఆది. ఆయన కథానాయకుడిగా నటించిన లవ్‌, యాక్షన్‌ డ్రామా ‘శశి’. సురభి కథానాయిక. శ్రీనివాస్‌ నాయుడు నడికట్ల దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం ఆది పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి చేతులమీదగా ‘శశి’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. టీజర్‌ ఆరంభంలో ఆది.. విభిన్నమైన లుక్‌లో.. ప్రేమలో విఫలమైన వ్యక్తిలా కనిపించారు.

‘మన చివరి క్షణాలు చూస్తున్నప్పుడే మొదటి క్షణాలు గుర్తుకువస్తాయి’, ‘మనకి నచ్చినట్లు మన లైఫ్‌ లేకపోతే.. లైఫ్‌ ఉండి వేస్ట్‌. మనకి కావాల్సింది మనం గట్టిగా అడగక పోతే గోల్‌ ఉండి వేస్ట్‌’ అంటూ ఆది చెప్పిన డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. సాయికుమార్‌ తనయుడిగా ‘ప్రేమకావాలి’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆది మొదటి సినిమాతో విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఆయన  ‘సుకుమారుడు’, ‘గాలిపటం’, ‘గరం’, ‘బుర్రకథ’, ‘జోడీ’ చిత్రాల్లో నటించారు.

ఇదీ చదవండి

షకీలా న్యూ సాంగ్‌ చూశారా?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని