Chor Bazaar: చూడగానే కళ్లు చెదిరి

ఆకాష్‌ పూరి కథానాయకుడిగా జీవన్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘చోర్‌ బజార్‌’. వీ.ఎస్‌.రాజు నిర్మిస్తున్నారు. గెహన సిప్పీ కథానాయిక. సురేష్‌ బొబ్బిలి స్వరాలందించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు

Updated : 13 Mar 2022 08:52 IST

కాష్‌ పూరి కథానాయకుడిగా జీవన్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘చోర్‌ బజార్‌’. వీ.ఎస్‌.రాజు నిర్మిస్తున్నారు. గెహన సిప్పీ కథానాయిక. సురేష్‌ బొబ్బిలి స్వరాలందించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం ఈ చిత్ర రెండో గీతాన్ని విడుదల చేశారు. ‘‘అబ్బబ్బ అది ఏం పోరి.. చూడగానే కళ్లు చెదిరి..’’ అంటూ సాగుతున్న ఈ మెలోడీ పాటకు మిట్టపల్లి సురేందర్‌ సాహిత్యమందించగా.. రామ్‌ మిర్యాల ఆలపించారు. భాను నృత్యరీతులు సమకూర్చారు. పాటలో ఆకాష్‌తో పాటు సీనియర్‌ నటి అర్చన కనిపించారు. ‘‘విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఆకాష్‌ కనిపించే తీరు.. ఆయన పలికే సంభాషణలు కొత్తగా ఉంటాయి. త్వరలో సినిమాని విడుదల చేస్తాం’’ అంది చిత్రబృందం తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని