‘షకీలా’ టీజర్‌ విడుదల 

దక్షిణాదిలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి షకీలా జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా ‘షకీలా’. ఇంద్రిజిత్‌ లంకేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటి రిచా చద్దా టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. బుధవారం ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. 1990ల కాలంలో...

Updated : 09 Dec 2020 16:35 IST

ముంబయి: దక్షిణాదిలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి షకీలా జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా ‘షకీలా’. ఇంద్రిజిత్‌ లంకేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటి రిచా చద్దా టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. బుధవారం ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. 1990ల కాలంలో షకీలా సినిమాలు థియేటర్‌లో విడుదలైనప్పుడు ఎలాంటి సందడి ఉండేదో ప్రచార చిత్రంలో చూపించారు. ఇటీవల వచ్చిన ‘మీర్జాపూర్‌’ సిరీస్‌తో అలరించిన నటుడు పంకజ్‌ త్రిపాఠి, మలయాళ నటుడు రాజీవ్‌ పిళ్లై ‘షకీలా’లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మలయాళం, హిందీ భాషల్లో డిసెంబరు 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
1995లో పదహారేళ్ల వయసులో షకీలా నటిగా కెరీర్‌ ఆరంభించారు. దాదాపు 250 సినిమాల్లో నటించారు. తెలుగులో ‘తొట్టి గ్యాంగ్‌’, ‘జయం’, ‘పుట్టింటికి రా చెల్లి’, ‘నిజం’, ‘దొంగోడు’, ‘బంగారం’, ‘కరెంట్‌’, ‘కొబ్బరిమట్ట’ తదితర చిత్రాల్లో కనిపించారు. ఆమె ఎక్కువగా మలయాళ చిత్రాలతో ప్రేక్షకులకు సుపరిచితురాలయ్యారు.

ఇవీ చదవండి..
క్రిస్మస్‌ కానుకగా థియేటర్లలో ‘షకీలా’


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని