Oke Oka Jeevitham: ఫిబ్రవరిలో ‘ఒకే ఒక జీవితం’

శర్వానంద్‌, రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తీక్‌ దర్శకుడు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రభు, ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్కినేని అమల కీలక పాత్రలో నటిస్తున్నారు.

Updated : 06 Nov 2021 13:52 IST

శర్వానంద్‌, రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తీక్‌ దర్శకుడు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రభు, ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్కినేని అమల కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం దీపావళి సందర్భంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. అమల ఓ గోడపై కూర్చొని ఉండగా.. శర్వానంద్‌, అతని తమ్ముడు ఆమె ఒడిలో తల పెట్టుకుని సేద తీరుతూ కనిపించారు. ‘‘సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో రూపొందుతోన్న ఫ్యామిలీ డ్రామా చిత్రమిది. శర్వాకు తల్లిగా అమల నటించారు. ఈ తల్లీ కొడుకుల అనుబంధం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది’’ అని దర్శక నిర్మాతలు తెలియజేశారు. జేక్స్‌ బిజోయ్‌ ఈ సినిమాకి స్వరాలందించగా.. సుజిత్‌ సారంగ్‌ ఛాయా
గ్రాహకుడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని