నాగశౌర్యకు జోడీగా విదేశీ ముద్దుగుమ్మ

యువ కథానాయకుడు నాగశౌర్య హీరోగా వస్తున్న చిత్రంలో హీరోయిన్‌ ఖరారైంది. ఆక్లాండ్‌కు చెందిన ప్రముఖ పాప్‌ సింగర్‌ శిర్లే సెటియా ఈ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని సెటియా సైతం స్వయంగా ఇన్‌స్టా్గ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. 

Published : 21 Nov 2020 23:39 IST

హైదరాబాద్‌: యువ కథానాయకుడు నాగశౌర్య హీరోగా వస్తున్న చిత్రంలో హీరోయిన్‌ ఖరారైంది. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు చెందిన ప్రముఖ పాప్‌ సింగర్‌ శిర్లే సెటియా ఈ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని సెటియా సైతం స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ చిత్రాన్ని నాగశౌర్య సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఉషా మలుపూరి నిర్మిస్తున్నారు. ‘అలా ఎలా’ ఫేమ్‌ అనీశ్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కుటుంబ కథా నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్‌లో చిత్రీకరణ పనులు ప్రారంభం కానున్నాయి. మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రొడక్షన్‌ నెం4గా ప్రారంభం కానున్న ఈ సినిమాకు టైటిల్‌ ఖరారు చేయాల్సి ఉంది.

యూట్యూబ్‌ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన శిర్లే ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌లోనూ చోటు సంపాదించింది. ఇప్పటికే ‘మస్కా’ అనే హిందీ సినిమాలో నటించింది. బాలీవుడ్‌లో మరో సినిమాకు కూడా ఓకే చెప్పేసిందట.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని