గాయని సునీత నిశ్చితార్థం

గాయని సునీత మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త రామ్‌ వీరపునేనిని ఆమె పెళ్లి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో సునీత-రామ్‌ల నిశ్చితార్థం వేడుకగా జరిగింది...

Updated : 08 Dec 2020 17:13 IST

హైదరాబాద్‌: గాయని సునీత మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త రామ్‌ వీరపునేనిని ఆమె పెళ్లి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో సునీత-రామ్‌ల నిశ్చితార్థం వేడుకగా జరిగింది. నిశ్చితార్థం గురించి తెలియజేస్తూ తాజాగా సునీత ఫేస్‌బుక్‌ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘ప్రతి తల్లిలాగానే నేను కూడా నా పిల్లలు చక్కగా జీవితాల్లో స్థిరపడాలని కోరుకుంటున్నాను. అదే సమయంలో నేనూ జీవితంలో సంతోషంగా స్థిరపడాలని ఆశించే అందమైన తల్లిదండ్రులు, పిల్లలు నాకున్నందుకు ఎంతో సంతోషిస్తున్నా. నా జీవితంలో అలాంటి మధుర క్షణం ఆసన్నమైంది. సంరక్షించే స్నేహితుడిగా.. అద్భుతమైన సహచరుడిగా రామ్‌ నా జీవితంలోకి ప్రవేశించాడు. మేమిద్దరం అతిత్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నాం. నా వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచానని అర్థం చేసుకున్న వారందరికీ కృతజ్ఞతలు. ఎప్పటికీ నన్ను సపోర్ట్‌ చేయాలని ఆశిస్తున్నా’ అని సునీత పేర్కొన్నారు.

తెలుగమ్మాయి అయిన సునీత గాయనిగా చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ఈవేళలో నీవూ’ అంటూ తొలిపాటతోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పటివరకూ దాదాపు కొన్నివందల పాటలు పాడారు. ‘మురారి’, ‘తమ్ముడు’, ‘ఊహలు గుసగుసలాడే’, ‘నేనున్నాను’, ‘బాస్‌’, ‘మహానటి’.. ఇలా ఎన్నో చిత్రాలకు ఆమె పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు. ఇటీవల ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రం కోసం సునీత పాడిన ‘నీలి నీలి ఆకాశం’ పాట ప్రేక్షకుల్ని బాగా ఆకర్షించింది. గాయనిగానే కాకుండా ఆమె డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా కూడా అలరించారు.

 

ఇవీ చదవండి

నిహారిక పెళ్లి.. నాగబాబు భావోద్వేగం..!

ఒక్కపైసా ఖర్చు లేకుండా కాజల్‌ హనీమూన్‌..?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని