సింగర్ సునీత-రామ్‌ల ప్రీ వెడ్డింగ్ పార్టీ
తెలుగు సినీ పరిశ్రమలో పేరుపొందిన గాయని సునీత మరోసారి వివాహబంధంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపునేనితో ఆమె ఏడడుగులు వేయనున్నారు. ఇరు కుటుంబపెద్దల సమక్షంలో ఇటీవల వీరి నిశ్చితార్థం...
శుభాకాంక్షలు తెలుపుతున్న అభిమానులు
హైదరాబాద్: ప్రముఖ గాయని సునీత మరోసారి వివాహబంధంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపునేనితో ఆమె ఏడడుగులు వేయనున్నారు. ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో ఇటీవల వీరి నిశ్చితార్థం వేడుకగా జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా శనివారం సాయంత్రం స్నేహితులు, సన్నిహితుల కోసం ఈ జంట ప్రీ వెడ్డింగ్ పార్టీని ఏర్పాటు చేసింది. గచ్చిబౌలిలోని BOULDER HILLSలో ఏర్పాటు చేసిన ఈ పార్టీకి ఇండస్ట్రీ నుంచి అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. అలాగే ప్రీ వెడ్డింగ్ పార్టీకి సంబంధించిన ఆహ్వాన పత్రిక అందర్నీ ఆకర్షిస్తోంది. పలువురు నెటిజన్లు సునీత-రామ్‌లకు అభినందనలు తెలుపుతున్నారు.
ఇదిలా ఉండగా ఇటీవల ఈ జంట ప్రత్యేకంగా ఓ పార్టీని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ పార్టీలో రేణూదేశాయ్, సుమ, పలువురు అతిథులు సందడి చేశారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు అప్పట్లో నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మరోవైపు వచ్చే నెలలో రామ్-సునీతల వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తేదీని తానే అధికారికంగా ప్రకటిస్తానని సునీత ఇటీవల ఓ కార్యక్రమంలో తెలిపారు.
‘గులాబి’ చిత్రంలోని ‘ఈవేళలో నీవూ’ పాటతో సునీత గాయనిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటిపాటతోనే ఆమె ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ‘మురారి’, ‘తమ్ముడు’, ‘ఊహలు గుసగుసలాడే’, ‘నేనున్నాను’, ‘మహానటి’ ఇలా ఎన్నో చిత్రాలకు ఆమె మధురమైన పాటలు పాడారు. ఇటీవల ఆమె ఆలపించిన ‘నీలి నీలి ఆకాశం’ పాటకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా ఆమె ప్రేక్షకుల్ని అలరించారు.
ఇదీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Ap-top-news News
Andhra News: ఆసుపత్రి భవనానికి వైకాపా రంగులు..!
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని