వీళ్లకు కావాల్సింది ఆడవాళ్ల ఆకారమే తప్ప..!

ప్రస్తుత్తం ఓటీటీ వేదికగా వైవిధ్యమైన కథాచిత్రాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. అలా వస్తున్న చిత్రాల్లో ఒకటి ‘సీతా ఆన్‌ ది రోడ్‌’. ప్రణీత్‌ యారోన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలోని ఐదుగురు మహిళ కథే ఇది. సినిమా కథాంశం ఏంటంటే ఒక సాహస ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్న ఐదుగురు అమ్మాయిలు ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటారు.

Updated : 07 Dec 2022 17:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రస్తుతం ఓటీటీ వేదికగా వైవిధ్యమైన కథా చిత్రాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. అలా వస్తున్న చిత్రాల్లో ‘సీతా ఆన్‌ ది రోడ్‌’ ఒకటి. ప్రణీత్‌ యారోన్‌ దర్శకుడు. సాహస ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్న ఐదుగురు అమ్మాయిలు, ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటారు? ఆ సమయంలో వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఆ నిర్ణయాలతో వారికి ఎటువంటి స్వేచ్ఛ లభించింది? అక్కడి నుంచి వారి ప్రయాణం ఎలా సాగిందనేది ‘సీతా ఆన్‌ ది రోడ్‌’.

కల్పిక గణేష్‌, గాయత్రి గుప్తా, ఖతేరా హకీమి, ఉమా లింగయ్య, నేసా ఫర్హాదిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మార్చి 5న జీప్లెక్స్‌లో విడుదల కానుంది.  సినిమా గురించి దర్శకుడు యారోన్‌ స్పందిస్తూ.. ‘‘ఈ చిత్రం మహిళ స్వీయ అన్వేషణ ప్రయాణాన్ని వివరిస్తుంది. జీవితంలో అనుకోని అడ్డంకులు ఎదురైనప్పుడు, అంతర్గత స్వరాన్ని వినిపించాలనుకున్న సమయంలో ఏమీ జరుగుతుందో ‘సీతా ఆన్‌ ది రోడ్‌’ లో చూడొచ్చని’’ తెలిపారు. జేపీ మోషన్‌ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రానికి ప్రనూప్‌ జవహార్‌, ప్రియాంక తాతి నిర్మాతలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని