Samanyudu: ‘సామాన్యుడు’ పోరు

విశాల్‌, డింపుల్‌ హయాతి జంటగా తు.పా.శరవణన్‌ తెరకెక్కించిన చిత్రం ‘సామాన్యుడు’. నాట్‌ ఏ కామన్‌మెన్‌.. అన్నది ఉపశీర్షిక. ఈ సినిమా ఈనెల 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది. 

Updated : 02 Feb 2022 06:57 IST

విశాల్‌, డింపుల్‌ హయాతి జంటగా తు.పా.శరవణన్‌ తెరకెక్కించిన చిత్రం ‘సామాన్యుడు’. నాట్‌ ఏ కామన్‌మెన్‌.. అన్నది ఉపశీర్షిక. ఈ సినిమా ఈనెల 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది. మంగళవారం ఈ చిత్ర స్నీక్‌ పీక్‌ను విడుదల చేశారు. రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ఈ ప్రచార చిత్రంలో.. సినిమాలోని ఓ కీలక యాక్షన్‌ ఎపిసోడ్‌ను చూపించారు. ఎవరి కోసమో.. విశాల్‌ వెదుకుతున్నట్లు ఇందులో చూపించారు. ఈ స్నీక్‌ను తీర్చిదిద్దిన విధానాన్ని బట్టి.. ఇందులో యాక్షన్‌ ఏ స్థాయిలో ఉండనుందో అర్థమవుతోంది. ఈ చిత్రంలో యోగిబాబు, బాబురాజ్‌, మరిముత్తు తదితరులు కీలక పాత్రలు పోషించారు. యువన్‌ శంకర్‌ రాజా స్వరాలందించారు. కెవిన్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు