అమ్మ ప్రేమ గొప్పదన్న కాజల్‌.. రాశీ జిగేల్‌

నటి కాజల్‌ అగర్వాల్‌ తన తల్లితో ఉన్న ఒక అపురూపమైన బ్లాక్‌అండ్‌వైట్‌ ఫొటోను అభిమానులతో పంచుకుంది. అందులో తన తల్లి గొప్పతనాన్ని ఆమె చెప్పుకొచ్చింది. తన పెంపుడు శునకంతో నటి వరలక్ష్మిశరత్‌కుమార్‌ కొన్ని ఫొటోలు పంచుకుంది. 

Published : 21 Dec 2020 01:36 IST

సోషల్‌ లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి కాజల్‌ అగర్వాల్‌ తన తల్లితో ఉన్న ఒక అపురూపమైన  ఫొటోను అభిమానులతో పంచుకుంది. అందులో లవ్యూ మమ్మీ అంటూ.. తన తల్లి గొప్పతనాన్ని ఆమె చెప్పుకొచ్చింది.

శరత్‌కుమార్ కూతురు, నటి వరలక్ష్మి తన పెంపుడు శునకంతో కొన్ని ఫొటోలు పంచుకుంది. 

సినీ హీరో వరుణ్‌తేజ్ తన చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. 90ల నాటి అల్లరిని గుర్తు చేసుకుంటూ ఒక ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్నాడు. 

 నటి రాశీఖన్నా ఓ ఫొటోను ఇన్‌స్టాలో పోస్టు చేసింది. అందులో బంగారు వర్ణపు చీరలో కుందనపు బొమ్మలా కనిపిస్తోంది.

బాలీవుడ్‌ నటి ప్రీతిజింటా తన భర్తతో ఉన్న ఒక ఫొటోను సోషల్‌మీడియాలో పోస్టు చేసింది. 

హీరోయిన్‌ ప్రణీత ఉదయం పూట సూర్యరశ్మిని ఆస్వాదిస్తున్నప్పటి ఒక ఫొటోను అభిమానులతో పంచుకుంది.

పెళ్లి చూపులు హీరోయిన్‌ రీతూవర్మ.. ‘మృదువుగా ఉండాలంటే శక్తిమంతంగా ఉండాలి’ అంటూ ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. 

హీరోయిన్‌ తమన్నా.. తన పుట్టినరోజు కానుకగా వచ్చిన గిఫ్టులతో ఫొటోలకు సరదాగా ఫోజులిచ్చింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు