ఒక్క ఏడాది.. రూ.315 కోట్లు..!

ప్రపంచంలోనే అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న నటిగా సోఫియా వెర్గారా అగ్ర స్థానంలో నిలిచారు. ఆమె ఏడాది కాలంలో 43 మిలియన్‌ డాలర్లు (రూ.315 కోట్లు) సంపాదించి ఈ ఘనత సొంతం చేసుకున్నారు. ప్రముఖ నటి ఏంజెలీనా జోలీని కూడా సోఫియా బీట్‌ విశేషమని విశ్లేషకులు అంటున్నారు. ఫోర్బ్స్‌-2020 టాప్‌ 10 జాబితాలో ఏంజెలీనా జోలీ ....

Updated : 05 Oct 2020 10:15 IST

ఫోర్బ్స్‌.. టాప్‌లో సోఫియా

లాస్ ఏంజెల్స్‌: ప్రపంచంలోనే అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న నటిగా సోఫియా వెర్గారా అగ్ర స్థానంలో నిలిచారు. ఆమె ఏడాది కాలంలో 43 మిలియన్‌ డాలర్లు (రూ.315 కోట్లు) సంపాదించి ఈ ఘనత సొంతం చేసుకున్నారు. ప్రముఖ నటి ఏంజెలీనా జోలీని కూడా సోఫియా దాటేయడం విశేషమని విశ్లేషకులు అంటున్నారు. ఫోర్బ్స్‌-2020 టాప్‌ 10 జాబితాలో ఏంజెలీనా జోలీ (35.5 మిలియన్‌ డాలర్లు), గాల్ గాడోట్ (31 మిలియన్‌ డాలర్లు), మెలిస్సా మెక్‌కార్తి (25 మిలియన్‌ డాలర్లు), మెరిల్‌ స్ట్రీప్‌ (24 మిలియన్‌ డాలర్లు), ఎమిలీ బ్లంట్‌ (22.5 మిలియన్‌ డాలర్లు), నికోల్‌ కిడ్మాన్‌ (22 మిలియన్‌ డాలర్లు), ఎల్లెన్‌ పాంపియో (19 మిలియన్‌ డాలర్లు), ఎలిజబెత్‌ మోస్‌ (16 మిలియన్‌ డాలర్లు), వియోలా డేవిస్‌ (15.5 మిలియన్‌ డాలర్లు) ఉన్నారు.

సోఫియా ‘ది మోడ్రన్‌ ఫ్యామిలీ’ షోతో బాగా పాపులర్‌ అయ్యారు. ఈ షో ఒక్క ఎపిసోడ్‌కు ఆమె 5 లక్షల అమెరికా డాలర్లు పారితోషికంగా తీసుకున్నారట. ‘ది మోడ్రన్‌ ఫ్యామిలీ’ షో సీజన్‌ 11 ఈ ఏడాది ఏప్రిల్‌తో ముగిసింది. ఆమె పలు సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. సోఫియా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 20.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని