పెళ్లికి దూరంగా ఉండాలని వార్నింగ్‌..!

‘మన రాజ్యాంగం మనకి స్వేచ్ఛగా బతకమని కొన్ని హక్కులు ఇచ్చింది. వాటిని మనం ఈ ప్రేమ, పెళ్లి అనే రిలేషన్‌షిప్స్‌తో నాశనం చేసేస్తున్నాం’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నటుడు సాయిధరమ్‌ తేజ్‌. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన యూత్‌ఫుల్‌...

Updated : 06 Dec 2022 15:00 IST

ఆకట్టుకునేలా ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ ట్రైలర్‌

హైదరాబాద్‌: ‘మన రాజ్యాంగం మనకి స్వేచ్ఛగా జీవించమని కొన్ని హక్కులు ఇచ్చింది. వాటిని మనం ఈ ప్రేమ, పెళ్లి అనే రిలేషన్‌షిప్స్‌తో నాశనం చేసేస్తున్నాం’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నటుడు సాయిధరమ్‌ తేజ్‌. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన యూత్‌ఫుల్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. సుబ్బు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

ప్రేమ, పెళ్లి అనే మాటలకు దూరంగా ఉండే సాయిధరమ్‌ తేజ్‌.. అనుకోకుండా నభానటేష్‌తో ఎలా ప్రేమలో పడతాడు? ఆ తర్వాత వీరిద్దరూ తమ జీవితాన్ని ఎలా ముందుకు సాగిస్తారు? ప్రేమపట్ల హీరోకి ద్వేషం కలగడానికి కారణమేమిటి? ఇలా విభిన్నమైన అంశాలతో యువతను ఆకర్షించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించనట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. ‘ఈ సినిమా హాళ్లలో మందు, సిగరెట్‌కి దూరంగా ఉండాలని వార్నింగ్‌ ఇస్తారు కదా. అలాగే పెళ్లికి, పెళ్లానికి దూరంగా ఉండాలని వార్నింగ్‌ ఇవ్వాలి’ అని రావురమేష్‌ చెప్పే డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘పద్ధతిగా తిరిగే భూమికి కూడా అప్పుడప్పుడూ భూకంపాలు వస్తుంటాయి’ అంటూ సాయిధరమ్‌ తేజ్‌ చెప్పిన డైలాగులు మెప్పించాయి.

ఇవీ చదవండి

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో

పిసినారి పెళ్లి.. లాక్‌డౌన్‌తో తిప్పలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని