Son of India: ప్రపంచం బాధే.. నా బాధ

‘‘ప్రపంచమంతా నా కుటుంబం.. ప్రపంచం బాధే నా బాధ’’ అంటున్నారు నటుడు మంచు మోహన్‌బాబు. ఇప్పుడాయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. దీనికి ఆయనే స్వయంగా స్క్రీన్‌ప్లే అందించారు. డైమండ్‌ రత్నబాబు తెరకెక్కించారు. విష్ణు మంచు నిర్మాత.

Updated : 11 Feb 2022 09:36 IST

‘‘ప్రపంచమంతా నా కుటుంబం.. ప్రపంచం బాధే నా బాధ’’ అంటున్నారు నటుడు మంచు మోహన్‌బాబు. ఇప్పుడాయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. దీనికి ఆయనే స్వయంగా స్క్రీన్‌ప్లే అందించారు. డైమండ్‌ రత్నబాబు తెరకెక్కించారు. విష్ణు మంచు నిర్మాత. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక. శ్రీకాంత్‌, తనికెళ్ల భరణి, నరేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ    నేపథ్యంలోనే గురువారం ట్రైలర్‌ విడుదల చేశారు. ‘‘ప్రపంచంలో ఏ పోరాటమైనా ఒక్కడితోనే ప్రారంభమవుతుంది’’ అంటూ మోహన్‌బాబు చెప్పిన డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. ప్రచార చిత్రాన్ని బట్టి.. దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలపై పోరాడే పౌరుడిగా మోహన్‌బాబు కనిపించనున్నట్లు అర్థమవుతోంది. ‘‘డబ్బున్నోడికి ఓ న్యాయం.. డబ్బులేనోడికి ఓ న్యాయం. పవర్‌ ఉన్నోడికి ఓ న్యాయం.. పవర్‌ లేనోడికి   ఓ న్యాయం. డెమోక్రసీలో లా ఒకొక్కడికి ఒక్కోలా ఉండటం ఎందుకు?’’,  ‘‘అయోధలో శ్రీరామ అని రాసిన ప్రతి ఇటుక మీద ప్రమాణం చేసి చెబుతున్నా. ఈ సోసైటీలో ఉన్న క్రిమినల్స్‌ని ఏరిపారేయాలి’’ అంటూ ట్రైలర్‌లో వినిపించిన సంభాషణలు శక్తిమంతంగా ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఛాయాగ్రహణం: సర్వేష్‌ మురారి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని