‘సోనూ ప్రమోషనల్‌‌ స్టంట్స్..ఫేక్‌ అకౌంట్లకు సాయం’

లాక్‌డౌన్‌ ఆరంభం నుంచి నటుడు సోనూసూద్‌ పేదల పాలిట  ఆపద్బాంధవుడిలా మారారు. వలస కార్మికుల్ని సొంత ఇళ్లకు చేర్చడంతో మొదలైన ఆయన సాయం ఇంకా కొనసాగుతోంది. ఓపక్క విద్యార్థుల ఉన్నత చదువులకు చేయూతగా నిలుస్తున్నారు. మరోపక్క చికిత్స చేయించుకునే స్థోమత లేని రోగులకు ఆర్థిక సాయం చేస్తున్నారు.....

Published : 27 Oct 2020 00:54 IST

నెటిజన్ ఘాటు వ్యాఖ్యలు.. ‌ఆధారాలు షేర్‌ చేసిన స్టార్‌

ముంబయి: లాక్‌డౌన్‌ ఆరంభం నుంచి నటుడు సోనూసూద్‌ పేదల పాలిట  ఆపద్బాంధవుడిలా మారారు. వలస కార్మికుల్ని సొంత ఇళ్లకు చేర్చడంతో మొదలైన ఆయన సాయం ఇంకా కొనసాగుతోంది. ఓపక్క విద్యార్థుల ఉన్నత చదువులకు చేయూతగా నిలుస్తున్నారు. మరోపక్క చికిత్స చేయించుకునే స్థోమత లేని రోగులకు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఆయన దాతృత్వాన్ని చూసి కొందరు మెచ్చుకుంటుంటే.. మరికొందరు విమర్శించడం బాధాకరం.

వ్యాధితో బాధపడుతున్న తన కుమారుడి శస్త్ర చికిత్సకు సాయం చేయండంటూ స్నేహల్‌ అనే వ్యక్తి ట్విటర్‌ వేదికగా సోనూను కోరారు. దీనికి ఆయన స్పందిస్తూ సాయం అందుతుందని ప్రామిస్‌ చేశారు. అయితే దీన్ని ఓ నెటిజన్‌ తప్పుపట్టాడు. ప్రచారం కోసం సోనూ ఫేక్‌ అకౌంట్లకు రిప్లై ఇస్తున్నారంటూ విమర్శించారు. ‘స్నేహల్‌ కొత్తగా ట్విటర్‌ ఖాతా ఆరంభించాడు. అతడ్ని కేవలం ముగ్గురు మాత్రమే ఫాలో అవుతున్నారు. కేవలం ఒకేఒక్క ట్వీట్‌ చేశాడు. స్వస్థలం, వివరాలు, ఈమెయిల్‌ అడ్రస్‌ కూడా లేవు. కానీ అతడి ట్వీట్‌ను సోనూ చూసి స్పందించారు. గతంలో ఆయన సాయం చేస్తానని రిప్లై ఇచ్చిన ట్విటర్‌ ఖాతాలు కూడా ఇలాంటివే. ఆ తర్వాత ఆ ట్వీట్‌ను చాలా మంది డిలీట్‌ చేశారు. పబ్లిక్‌ రిలేషన్స్‌ టీం ఇలా పనిచేస్తోంది’ అని పేర్కొన్నారు.

దీనికి సోనూ సరైన సమాధానం ఇచ్చారు. ‘అవసరాల్లో ఉన్న వారిని నేను గుర్తించా. నా రూపంలో వారికి సాయం అందుతోంది. ఇదంతా మన ఆలోచనల్ని బట్టి ఉంటుంది. నీకు అర్థం కాదు. రోగి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.. అతడికి కొన్ని పండ్లు పంపించు. కోట్ల మంది ఫాలోవర్స్‌ ఉన్న వ్యక్తి ప్రేమగా వ్యవహరిస్తే ముగ్గురు ఫాలోవర్స్‌ ఉన్న వ్యక్తి ఎంతో సంతోషంగా ఫీల్‌ అవుతాడు’ అంటూ ఆసుపత్రి రిసిప్ట్స్‌ షేర్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని