
కంగనా.. నీ ధైర్యానికి హ్యాట్సాఫ్: విశాల్
చెన్నై: మహారాష్ట్ర ప్రభుత్వంతో మాటల యుద్ధం కొనసాగిస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు దక్షిణాది సినీనటుడు విశాల్ మద్దతు పలికారు. శివసేన నేతలతో ఆమె తలపడుతుండటాన్ని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్ పోరాటంతో పోల్చారు. ఈ మేరకు కంగన ధైర్యాన్ని ప్రశంసిస్తూ విశాల్ ఓ ట్వీట్ చేశారు.
‘‘డియర్ కంగన.. నీ ధైర్యసాహసాలకు హ్యాట్సాఫ్. నీ వ్యక్తిగతమైన సమస్య కాకపోయినా ధైర్యంగా నిలబడి ప్రభుత్వాన్ని ఎదురిస్తున్నావు. ప్రభుత్వాలు తప్పులు చేసినప్పుడు తమ గళాన్ని ఎలా వినిపించాలో ప్రజలకు ఓ పెద్ద ఉదాహరణగా నిలిచావు. ఇది 1920లలో భగత్‌సింగ్ చేసిన పోరాటంలాంటిదే. ఒక సెలబ్రిటీనే కాకుండా సామాన్యుడు సైతం ప్రభుత్వాన్ని నిలదీయ వచ్చనే సందేశాన్ని సమాజానికి ఇచ్చినందుకు అభినందనలు’’ అని పేర్కొన్నారు.
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ అనుమానాస్పద మరణం తర్వాత కంగన ముంబయిని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోలుస్తూ వ్యాఖ్యలు చేయడంతో ఆమెకు, అధికార శివసేన పార్టీ నేతలకు మధ్య వివాదం రేగిన సంగతి తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.