వీడియోకాల్‌ చేసి.. కథ చెప్పారు..!

తన పాటలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న న్యూజిలాండ్‌ పాప్‌ సింగర్‌ షర్లీ సెటియా త్వరలో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమవనున్న విషయం తెలిసిందే. అనీశ్‌ కృష్ణన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ రొమాంటిక్‌ కామెడీ చిత్రంలో నాగశౌర్య సరసన ఆమె సందడి చేయనున్నారు...

Updated : 25 Nov 2020 15:30 IST

పాప్‌ సింగర్‌ షర్లీ సెటియా

హైదరాబాద్‌: తన పాటలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న న్యూజిలాండ్‌ పాప్‌ సింగర్‌ షర్లీ సెటియా త్వరలో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమవనున్న విషయం తెలిసిందే. అనీశ్‌ కృష్ణన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ రొమాంటిక్‌ కామెడీ చిత్రంలో నాగశౌర్య సరసన ఆమె సందడి చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె దక్షిణాది చిత్ర పరిశ్రమ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘నాకు తెలుగు అర్థం కాదు. కానీ దక్షిణాదిలో తెరకెక్కిన చాలా చిత్రాలను సబ్‌టైటిల్స్‌తో చూసి ఎంజాయ్‌ చేశాను. తెలుగు సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. నాకు సంబంధించిన పలు వీడియోలను దర్శకుడు అనీశ్‌ యూట్యూబ్‌లో చూసి.. లాక్‌డౌన్‌ సమయంలో ఫోన్‌ ద్వారా నన్ను సంప్రదించారు. వీడియో కాల్‌ చేసి స్ర్కిప్ట్‌ వివరించారు. కథ  బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేప్పేశాను. తెలియని భాషే అయినప్పటికీ ఆ సినిమాలో నటించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’

‘నటి కావాలనే ఉద్దేశంలో న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీలో చేరాను. కానీ నేను సింగర్‌ని కావాలని విధి ముందే నిర్ణయించింది. నా పాటల పట్ల ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎంతో సంతోషిస్తున్నా.’

‘2016లో ఓసారి హైదరాబాద్‌లోని ఓ మాల్‌కి వచ్చాను. ఆ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా అభిమానులకు తెలియజేశాను. దాంతో నన్ను కలిసేందుకు వందలమంది ఆ మాల్‌ వద్దకు చేరుకున్నారు. వాళ్లందర్నీ చూసి షాక్‌ అయ్యాను. తెలుగు సినిమాతో కథానాయికగా పరిచయమవుతున్నానని ఇటీవల తెలియజేయగానే ఎంతోమంది నాపై మరింత అభిమానం కురిపిస్తున్నారు’ అని షర్లీ సెటియా వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని