‘వి’ స్పెషల్‌ ఫొటో పంచుకున్న నాని

నాని, సుధీర్‌బాబు కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నివేదా థామస్‌, అదితిరావు హైదరీ కథానాయికలు. శనివారం

Published : 04 Sep 2020 15:59 IST

హైదరాబాద్‌: నాని, సుధీర్‌బాబు కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నివేదా థామస్‌, అదితిరావు హైదరీ కథానాయికలు. శనివారం అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నాని ఈ సినిమాలోని ఓ స్పెషల్‌ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

నాని ఇందులో ప్రతినాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ విడుదల చేసిన ప్రచార చిత్రాలు, ట్రైలర్‌లో గుబురు గడ్డం, మెలి తిరిగిన మీసంతో కనిపించిన నాని తాజా ఫొటోలో లవర్‌బాయ్‌లా అందంగా కనిపించారు. అదితిరావు హైదరీని కౌగలించుకుని చిరు నవ్వులు చిందిస్తున్న ఫొటో ఆకట్టుకుంటోంది. అయితే, ట్రైలర్‌లో నాని పూర్తి భిన్నంగా ఉండటం విశేషం. మరి నాని విలన్‌గా మారడానికి కారణం ఎవరు? ఎలాంటి పరిస్థితుల్లో మారాల్సి వచ్చింది? తుపాకి పట్టిన తర్వాత ఎదురైన పరిస్థితులు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని