మరోసారి సెంటిమెంట్‌కే ఓటేసిన ‘కేజీఎఫ్‌-2’

డిసెంబర్‌ 21.. ‘కేజీఎఫ్‌’ చిత్రబృందానికి బాగా కలిసి వచ్చిన తేదీ. కన్నడ నటుడు యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పవర్‌ఫుల్‌ యాక్షన్‌ చిత్రం ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌-1’ 2018 డిసెంబర్‌ 21న విడుదలైన ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే....

Published : 19 Dec 2020 15:51 IST

సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు సిద్ధమైన టీమ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌‌: డిసెంబర్‌ 21.. ‘కేజీఎఫ్‌’ చిత్రబృందానికి బాగా కలిసి వచ్చిన తేదీ. కన్నడ నటుడు యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పవర్‌ఫుల్‌ యాక్షన్‌ చిత్రం ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌-1’ 2018 డిసెంబర్‌ 21న విడుదలైన ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్‌గా ‘కేజీఎఫ్‌-2’ తెరకెక్కుతోంది. ఈ మేరకు గతేడాది డిసెంబర్‌ 21న ‘కేజీఎఫ్‌-2’ నుంచి యశ్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసి చిత్రబృందం అందర్నీ ఆకర్షించింది.

కాగా, తాజాగా ‘కేజీఎఫ్‌’ చిత్రబృందం తమ సెంటిమెంట్‌ను మరోసారి రిపీట్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. తమకి ఎంతో కలిసొచ్చిన డిసెంబర్‌ 21న ప్రేక్షకులకు ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ ఓ ట్వీట్‌ పెట్టారు. ‘‘కేజీఎఫ్‌-2’ ముగింపునకు మేము చేరువలో ఉన్నాం. ప్రతిఏడాది డిసెంబర్‌ 21న అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేసిన మేము ఈ ఏడాది కూడా అదే ఆచారాన్ని ఫాలో అయ్యేందుకు సిద్ధమవుతున్నాం. మా అధికారిక సోషల్‌మీడియా ఖాతాల వేదికగా.. డిసెంబర్‌ 21న ఉదయం 10.08 గంటలకు మేము స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నాం. సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నందుకు కృతజ్ఞతలు’ అని చిత్రబృందం పేర్కొంది. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా అధీరా పాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాదిలో ఈసినిమా విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఇవీ చదవండి

‘సలార్‌’ అర్థం చెప్పిన ప్రశాంత్‌ నీల్‌..!

‘కేజీఎఫ్‌-2’ టీజర్‌ డేట్‌ ఫిక్స్‌..!

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts