Sreemukhi: క్రేజీ అంకుల్స్‌.. టైటిల్‌ సాంగ్‌తో ఊపేస్తున్న శ్రీముఖి

బుల్లితెరపై అలరిస్తున్న యాంకర్‌ శ్రీముఖి ఇప్పుడు వెండితెరపై సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఆమె ఇప్పటికే పలు సినిమాల్లో నటించినా.. తొలిసారిగా ప్రధానపాత్రలో కనిపించి సందడి చేయనుంది. సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘క్రేజీ అంకుల్స్‌’లో ఆమె లీడ్‌ రోల్‌ పోషించింది.

Published : 25 Jul 2021 23:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బుల్లితెరపై అలరిస్తున్న యాంకర్‌ శ్రీముఖి ఇప్పుడు వెండితెరపై సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఆమె ఇప్పటికే పలు సినిమాల్లో నటించినా.. తొలిసారిగా ప్రధానపాత్రలో కనిపించి సందడి చేయనుంది. సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘క్రేజీ అంకుల్స్‌’లో ఆమె లీడ్‌ రోల్‌ పోషించింది. ఈ చిత్రంలో క్రేజీ అంకుల్స్‌గా రాజా రవీంద్ర, సింగర్ మనో, భరణి కనిపించనున్నారు. కాగా.. సినిమాలోని టైటిల్‌ సాంగ్‌ను ప్రముఖ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి ఆదివారం విడుదల చేశారు. ఈ పాట కుర్రకారుకు బాగా ఆకట్టుకునేలా ఉంది. డిస్కోలో జరుగుతున్న పార్టీలో డ్యాన్స్‌ చేస్తున్న శ్రీముఖి.. ఆమెను ఇంప్రెస్‌ చేసేందుకు తెగ ప్రయత్నిస్తున్న అంకుల్స్‌.. ఈ పాటలో చూపించారు. 

మధ్య వయస్కులైన ముగ్గురు వ్యక్తులు.. 20ల్లో చేయలేకపోయిన చిలిపి పనులను మళ్లీ చేయాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే వాళ్లకు ఓ అందమైన అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. మరి తర్వాత ఏం జరిగింది. వారు తమ కోరికలు నెరవేర్చుకోగలిగారా..? శ్రీముఖి వాళ్లకు ఎలా సహాయం చేయగలిగింది.. అనేదే కథ. ఈ చిత్రాన్ని గుడ్ సినిమా బ్యానర్‌పై కిరణ్ తలశిల సమర్పణలో బొడ్డు అశోక్ నిర్మించారు. పోసాని కృష్ణ మురళీ, రఘు, హేమా, గాయత్రి భార్గవి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం అందించారు. ఈ ఏడాది ఆగస్టులో థియేటర్స్‌లో విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాత శ్రేయాస్‌ శ్రీనివాస్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని