ఈ యాప్‌ వెనక ఉన్నదెవరు?

‘సామాజిక మాధ్యమాల్లో ఒక యాప్‌ కారణంగా ఎనిమిది మంది మహిళలు ఆత్మహత్య చేసుకుంటారు. ఆ యాప్‌ గురించి విచారించడానికి ఓ మహిళా

Published : 07 Sep 2020 14:08 IST

హైదరాబాద్‌: ‘సామాజిక మాధ్యమాల్లో ఒక యాప్‌ కారణంగా ఎనిమిది మంది మహిళలు ఆత్మహత్య చేసుకుంటారు. ఆ యాప్‌ గురించి విచారించడానికి ఓ మహిళా అధికారి రంగంలోకి దిగుతుంది. ఆమె అందులోని లోతుపాతులన్నింటినీ ఛేదిస్తుందా? ఈ యాప్‌ వెనక ఉన్నదెవరూ?’ ఇలా ఎన్నో ఊహాగానాలు రేకెత్తిస్తూ ఉత్కంఠగా సాగుతోంది ‘ఇట్స్‌ టైమ్‌ టు పార్టీ’ ట్రైలర్‌. తాజాగా చిత్రబృందం దీన్ని విడుదల చేసింది.

ఈ సినిమాలో శ్రీముఖి ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఏయిమ్స్‌ మోషన్‌ పిక్చర్స్, కాక్‌టెయిల్‌ సినిమాస్‌ పతాకాలపై స్వీయ దర్శకత్వంలో గౌతమ్‌ ఈవీఎస్‌ నిర్మిస్తున్నారు. అల్లం సుభాష్‌ మరో నిర్మాత. AIMS.Movie వేదికగా సెప్టెంబరు 11న ఈ చిత్రం విడుదల కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు