‘శ్రీ కనకమహాలక్ష్మీ లక్కీ డ్రా’ ప్రోమో చూశారా!

‘శ్రీ కనకమహాలక్ష్మీ లక్కీ డ్రా’.. ఇక్కడ ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రమే కాదు ఆకర్షించే బహుమతులు కూడా దొరుకుతాయి. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని త్వరలో ఈటీవీలో ‘శ్రీ కనకమహాలక్ష్మీ లక్కీ డ్రా’ అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. బుల్లితెర సెలబ్రిటీలు, సినీ గాయనీ....

Published : 26 Oct 2020 00:44 IST

ఎంటర్‌టైన్‌మెంట్‌+ఎగ్జైట్‌మెంట్‌

హైదరాబాద్‌: ‘శ్రీ కనకమహాలక్ష్మీ లక్కీ డ్రా’.. ఇక్కడ ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రమే కాదు ఆకర్షించే బహుమతులు కూడా దొరుకుతాయి. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని త్వరలో ఈటీవీలో ‘శ్రీ కనకమహాలక్ష్మీ లక్కీ డ్రా’ అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. బుల్లితెర సెలబ్రిటీలు, సినీ గాయనీ గాయకులతో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు సిద్ధమైన ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.

శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ‘జబర్దస్త్‌’, ‘పటాస్‌’ కమెడియన్లు సుధీర్‌, ఆది, రాంప్రసాద్‌, రాఘవ, బుల్లెట్‌ భాస్కర్‌, సింగర్‌ ధనుంజయ్‌, మ్యూజిక్‌ దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ తమ టాలెంట్స్‌తో ప్రేక్షకులను అలరించారు. శేఖర్‌ మాస్టర్‌-రోజా డ్యాన్స్‌తో పాటు శేఖర్‌ మాస్టర్‌ తనయుడు విన్ని సైతం స్టేజ్‌పై సందడి చేశారు. మరోవైపు సోనూసూద్‌ నుంచి సాయం పొందిన దాదాపు 85 ఏళ్ల వృద్ధురాలు ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రమే కాకుండా కారు, ఇల్లు, బంగారం, డబ్బు లాంటి ఆకర్షణీయమైన బహుమతులు కూడా ఇవ్వనున్నట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది. అయితే బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ప్రోమో చివర్లో చూపించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈటీవీ ప్రసారం కానున్న ‘శ్రీ కనకమహాలక్ష్మీ లక్కీ డ్రా’ ప్రోమో చూసేయండి.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని