నవ్వులు పూయిస్తున్న సరికొత్త ఈవెంట్‌

‘శ్రీ కనక మహాలక్ష్మి లక్కీ డ్రా’.. గెలుపొందిన వారికి విలాసవంతమైన విల్లా, కారు, కేజీ బంగారం, డబ్బు.. బహుమతిగా అందిస్తామంటూ ‘దీపావళి’ వేడుకలను మరింత ఉల్లాసంగా, ఉత్సాహంగా మార్చడానికి ఓ కార్యక్రమం సిద్ధమైంది. పండగ పర్వదినాలను ప్రత్యేకంగా మార్చడం కోసం ప్రతి ఏడాది ఈటీవీలో కొన్ని స్పెషల్‌ ఈవెంట్స్‌ ప్రసారమవుతుంటాయి...

Published : 02 Nov 2020 11:56 IST

 

హైదరాబాద్‌: ‘శ్రీ కనక మహాలక్ష్మీ లక్కీ డ్రా’.. గెలుపొందిన వారికి విలాసవంతమైన విల్లా, కారు, కేజీ బంగారం, డబ్బు.. బహుమతిగా అందిస్తామంటూ ‘దీపావళి’ వేడుకలను మరింత ఉల్లాసంగా, ఉత్సాహంగా మార్చడానికి ఓ కార్యక్రమం సిద్ధమైంది. పండగ పర్వదినాలను ప్రత్యేకంగా మార్చడం కోసం ప్రతి ఏడాది ఈటీవీలో కొన్ని స్పెషల్‌ ఈవెంట్స్‌ ప్రసారమవుతుంటాయి. ఈ ఏడాది సైతం ‘అమ్మ నాన్న ఓ సంక్రాంతి’, ఉగాదికి ‘2020 అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’, దసరా సందర్భంగా ‘అక్కా ఎవరే అతగాడు?’ లాంటి కార్యక్రమాలతో అలరించిన ఈటీవీ తాజాగా ‘శ్రీ కనక మహాలక్ష్మీ..’తో దీపావళికి ప్రతి ఇంట్లో సందడి వాతావరణాన్ని నెలకొల్పడానికి సిద్ధమైంది.

శ్రీముఖి వ్యాఖ్యాతగా రోజా, శేఖర్‌మాస్టర్‌ న్యాయనిర్ణేతలుగా ‘శ్రీ కనక మహాలక్ష్మి లక్కీ డ్రా’ ఈవెంట్‌ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకోనుంది. తాజాగా విడుదలైన ఈ ప్రోగ్రామ్‌ ప్రోమో సెలబ్రిటీలనే కాకుండా వీక్షకులను సైతం కడుపుబ్బా నవ్విస్తోంది. ఈవెంట్‌లో భాగంగా ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌.. తన లైవ్‌ పెర్ఫామెన్స్‌తో మెప్పించనున్నారు.

బుల్లెట్‌ భాస్కర్‌, గెటప్‌ శ్రీను, ఆటో రాంప్రసాద్‌తోపాటు ఇతర ‘జబర్దస్త్‌’ కమెడియన్లు కలిసి చేసిన ఓ స్కిట్‌ నవ్వులు పూయించేలా ఉంది. స్కిట్‌లో భాగంగా గెటప్‌ శ్రీను ఇంటమ్మాయిని పెళ్లిచూపులు చూసేందుకు బుల్లెట్‌ భాస్కర్‌ వెళ్లడం... సినిమాపై ఉన్న పిచ్చితో గంట మోగిన వెంటనే తనతోపాటు తన కుటుంబ సభ్యులందరూ పలువురు సినీ తారల పాత్రల్లోకి పరాకాయ ప్రవేశం చేస్తామని, అది తమ వీక్‌నెస్‌ అని శ్రీను వివరించడం.. అనంతరం చిరు, విజయ్‌ దేవరకొండ, బాలయ్య.. వాయిస్‌లతో శ్రీను అండ్‌ గ్యాంగ్‌ వేసే పంచులకు సెట్‌లో ఉన్న సెలబ్రిటీలందరూ నవ్వులు పూయిస్తున్నట్లు ఈ ప్రోమోలో చూపించారు. దీపావళి పండగ రోజున ఉదయం 9 గంటలకు ఈటీవీలో ప్రసారం కానున్న ‘శ్రీ కనక మహాలక్ష్మీ లక్కీ డ్రా’ ప్రోమో చూసేయండి.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని