‘శ్రీదేవి సోడా సెంటర్‌’ అంటున్న సుధీర్‌బాబు

యువ కథానాయకుడు సుధీర్‌బాబు ‘సూరిబాబు’గా మారారు. ఆయన కొత్త సినిమాను శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. దీనికి ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను 70ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌....

Published : 30 Oct 2020 21:32 IST

‘మనోడు లైటింగ్ ఎడితే ఊరంతా మెరిసిపోద్ది..’

హైదరాబాద్‌: యువ కథానాయకుడు సుధీర్‌బాబు ‘సూరిబాబు’గా మారారు. ఆయన కొత్త సినిమాను శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. దీనికి ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను 70ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ బాణీలు సమకూరుస్తున్నారు. ‘మనోడు లైటింగ్ ఎడితే ఊరంతా మెరిసిపోద్ది..’ అంటూ ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను సుధీర్‌ షేర్‌ చేశారు. జాతర వాతావరణాన్ని చూపిస్తూ.. ఆయన లుక్‌ను విడుదల చేశారు. ఇందులో సుధీర్‌ సరసన ఎవరు సందడి చేయబోతున్నారో తెలియాల్సి ఉంది. అమలాపురం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

సుధీర్‌బాబు ఇటీవల ‘వి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన డీసీపీ ఆదిత్యగా నటించిన తీరుకు ప్రశంసలు దక్కాయి. మరోపక్క ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌లోనూ ఆయన నటించనున్నారు. ఈ సినిమా కోసం గత కొంత కాలంగా కసరత్తులు చేస్తున్నారు. తెలుగుతోపాటు హిందీలోనూ ఈ ప్రాజెక్టు రూపొందనుంది. ‘ఈ బయోపిక్‌ స్క్రిప్టు సిద్ధంగా ఉంది. డిసెంబరులో షూటింగ్‌ ప్రారంభించే అవకాశాలున్నాయి. 2021 టోక్యో ఒలింపిక్స్‌ కంటే ముందు చిత్రాన్ని విడుదల చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నాం. ఎంతో స్ఫూర్తినిచ్చే గోపీచంద్‌ జీవిత కథ దేశంలోని ప్రతి ఒక్కరికీ తెలియాలి. ఈ సినిమా చూసిన తర్వాత కొందరైనా క్రీడాకారులుగా మారితే నా లక్ష్యం నెరవేరినట్లే’ అని ఇటీవల సుధీర్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని