Sudheer Babu: సుధీర్‌బాబు కొత్త చిత్రం ప్రారంభం

భవ్య క్రియేషన్స్‌ పతాకంపై సుధీర్‌బాబు కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. మహేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వి.ఆనందప్రసాద్‌ నిర్మాత.శనివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది.  సీనియర్‌ నటుడు శ్రీకాంత్‌, ‘ప్రేమిస్తే’ భరత్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Updated : 13 Feb 2022 11:26 IST

భవ్య క్రియేషన్స్‌ పతాకంపై సుధీర్‌బాబు కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. మహేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వి.ఆనందప్రసాద్‌ నిర్మాత.శనివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది.  సీనియర్‌ నటుడు శ్రీకాంత్‌, ‘ప్రేమిస్తే’ భరత్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘కథానాయకుడిగా సుధీర్‌బాబు పదేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ దశలో ఆయనతో సినిమా చేస్తుండడం సంతోషంగా ఉంది. ఇదొక యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో తెరకెక్కుతోంది. కథ వినగానే సుధీర్‌ సినిమా చేయడానికి అంగీకారం తెలిపారు. ఆయన ఓ శక్తివంతమైన పోలీస్‌ అధికారిగా కనిపిస్తారు. మార్చి 14 నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తామ’’న్నారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ ‘‘నిర్మాత ఆనందప్రసాద్‌ అన్నా, ఆయన సంస్థ అన్నా ఎంతో గౌరవం. ఇది పూర్తిస్థాయి యాక్షన్‌ చిత్రం. శ్రీకాంత్‌, భరత్‌లతో కలిసి నటిస్తుండడం సంతోషంగా ఉంది’’ అన్నారు. శ్రీకాంత్‌   మాట్లాడుతూ ‘‘పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ నేపథ్యంలో ఓ విభిన్నమైన కథతో రూపొందుతున్న సినిమా ఇది. దర్శకుడు మహేష్‌ ఓ మంచి కథని తీసుకొచ్చారు’’ అన్నారు. ‘‘తెలుగులో ‘ప్రేమిస్తే సినిమాని అందరూ చూశారు. నటుడిగా పరిచయమైన 19 ఏళ్ల తర్వాత నేరుగా తెలుగులో చేస్తున్న ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం’’ అన్నారు నటుడు భరత్‌. కొత్త రకమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని చెప్పారు దర్శకుడు. ఈ సినిమాకి ఛాయాగ్రాహణం: అరుల్‌ విన్సెంట్‌, కళ: వివేక్‌, కూర్పు: ప్రవీణ్‌ పూడి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని