‘నువ్వు అంతగా బాగోవు’..!

తన రోజువారీ జీవితానికి సంబంధించిన ఫొటోలను తరచూ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ కుమార్తె సుహానా ఖాన్‌. షారుఖ్‌ కుమార్తెగా చిన్నప్పటి నుంచే ఆమె ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కొంతకాలం నుంచి...

Published : 30 Sep 2020 14:02 IST

స్టార్‌ హీరో కుమార్తెపై నెటిజన్ల ట్రోలింగ్‌

ముంబయి: తన రోజువారీ జీవితానికి సంబంధించిన ఫొటోలను తరచూ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ కుమార్తె సుహానా ఖాన్‌. షారుఖ్‌ కుమార్తెగా చిన్నప్పటి నుంచే ఆమె ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కొంతకాలం నుంచి సుహానాఖాన్‌పై పలువురు నెటిజన్లు తీవ్రంగా ట్రోలింగ్‌ చేస్తున్నారు. సుహానా అంతగా బాగోదని పేర్కొంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది నెటిజన్లు అయితే ఇంకొక్క అడుగు ముందుకేసి.. సుహానా గురించి మీమ్స్‌ కూడా తయారు చేశారు.

కాగా, తనపై వస్తోన్న ట్రోలింగ్‌ గురించి సుహానా తాజాగా స్పందించారు. తన అందం గురించి కామెంట్లు చేస్తోన్న వారందరికీ దీటుగా సమాధానమిచ్చారు. ‘ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎన్నో సమస్యలు మనం చూస్తున్నాం. వాటిలో ఇది కూడా ఒకటి. దీనిని మనం రూపుమాపాలి. ఇది కేవలం నేను ఒక్కదానినే కాదు ఎంతో మంది ఎదుర్కొంటున్నారు. నేను చూడడానికి అందంగా ఉండడని నెటిజన్లు చేసిన కామెంట్లు నా దృష్టికి వచ్చాయి. నేను 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి నాపై ట్రోల్సింగ్స్‌ చేస్తున్నారు. నేను మాత్రం వాటిని చూసి బాధపడను. ఇలా ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను’ అని సుహానా ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని